• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS JAGAN BECOME PM YCP MLA PARTHASARATHI SHOCKING COMMENTS NGS

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారా?

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారా?

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ఏపీ సీఎం జగన్ ప్రధాని అవుతారా? దేశ ప్రజల కోరిక కూడా అదేనా? మరి ఏపీలో వైసీపీ నేతల కోరిక ఏంటి. అధినేత జగన్ ను జాతీయ రాజకీయాల్లో చూడాలి అనుకుంటున్నారా? ఇలాంటి చర్చకు తావు లేపారు వైసీపీ నేతలే. అదికూడా స్వయంగా సీఎం జగన్ సమక్షంలోనే ప్రధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు.

  • Share this:
    వైసీపీ అధినేత జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ముచ్చటగా మూడేళ్లు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే ప్రధాని ఏంటి అని డౌట్ పడుతున్నారా? నిజంగానే వైఎస్ జగన్ దేశరాజకీయాలు వైపు చూస్తున్నారని డౌట్ పడుతున్నారా?.. సీఎంగా ఉన్న ఆయన్ను ప్రధాని కావాలని ఎవరు కోరుకుంటున్నారు? మరి జగన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే.. ఏపీకి సీఎం ఎవరిని లెక్కలు వేసుకుంటున్నారా? అయితే ఈ మాట అన్నది ఎవరో కాదు స్వయంగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఇప్పుడు జగన్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తారా అంటూ అప్పుడు చర్చ కూడా మొదలైంది.

    ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. విపక్షాలు కూడా దీన్ని కాదనలేవు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎవ్వరూ ఊహించని రీతిలో సంక్షేమ పథకాలను పెంచుకుంటూ పోతున్నారు. వాటి అమలు తీరుపై విమర్శలు ఎలా ఉన్నా.. కొత్త కొత్త సంక్షేమ పథకాలు మాత్రం ప్రకటిస్తూ దూకుడుగా జనగ్ దూసుకుపోతున్నారు. జగన్ అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్న మాట వాస్తవమే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఇక్కడ అమలయ్యే పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నాయి కూడా..

    ఏపీ వ్యాప్తంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి.. దేశంలోని ప్రజలంతా జగనే ప్రధాని కావాలని కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారథి. సీఎం జగన్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆ సమయంలో జగన్ పెదాలపై చిరునవ్వుతో కనిపించారు. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని పేదలందరూ జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించగా.. సీఎం జగన్ ప్రధాని కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని పార్థసారథి అంటున్న సమయంలో.. అక్కడున్న వాలంటీర్లు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్దగా కేకలు, విజిల్స్ వేసి సందడి చేశారు. ఆ సమయంలో సీఎం జగన్ సైతం ప్రతిస్పందనగా.. చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు.

    మరోవైపు మంత్రులు సైతం చంద్రబాబు పై సెటైర్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 50 వేలకు పైగా వాలంటీర్లను చూసి చంద్రబాబు సహా ఇతర విపక్ష నేతలు మనసులో కుళ్లుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జగన్ కు వాలంటీర్లు సైన్యంలా మారారని గుర్తు చేస్తున్నారు. ఏపీలో వాలంటీర్లు నిబద్ధతతో 24 గంటలు పని చేస్తుండడడంతో.. వారి దెబ్బకు సర్వర్లు హ్యాంగ్ అయిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు