Tirupati ByPolls: తిరుపతి మాజీ ఎంపీ కుమారుడికి పదవి.. కన్ ఫాం చేసిన జగన్

బల్లి దుర్గా ప్రసాదరావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఉస్తామని జగన్ చెప్పినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

news18-telugu
Updated: November 20, 2020, 2:46 PM IST
Tirupati ByPolls: తిరుపతి మాజీ ఎంపీ కుమారుడికి పదవి.. కన్ ఫాం చేసిన జగన్
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తిరుపతి మాజీ ఎంపీ, కరోనా సోకి గుండెపోటుతో చనిపోయిన బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తిరుపతిలో ఉప ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంతో జగన్ మాట్లాడారు. ఎన్నికల్లో మరో అభ్యర్థిని బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆయన పేరు దాదాపు ఖరారు కావడంతో, దుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఖాయం చేసినట్టు చెబుతున్నారు. తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబాన్ని రాజకీయంగా అన్నివిధాలా ఆదుకుంటామని సీఎం జగన్ చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో బల్లి దుర్గా ప్రసాదరావు భార్య, కొడుకు కళ్యాణ్ చక్రవర్తి కలిశారు. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. బల్లి దుర్గా ప్రసాదరావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఉస్తామని జగన్ చెప్పినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శాసన మండలిలో మొదట ఏ స్థానం కాళీ అయితే.. ఆ స్థానంలో కళ్యాణ్ చక్రవర్తిని ఎమ్మెల్సీని చేస్తామన్నారు. తనతోపాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో బల్లి కళ్యాణ్ చక్రవర్తి నడవాలన్నది సీఎం జగన్ అభిమతం, ఆకాంక్ష అని బొత్స అన్నారు.

జగన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాంః బల్లి కళ్యాణ్ చక్రవర్తి

తన తండ్రి బల్లి దుర్గాప్రసాదరావు కోవిడ్ కు గురైన దగ్గర నుంచి.. ఆ కష్టకాలంలో ముఖ్యమంత్రి జగన్ ప్రతి విషయంలోనూ తమకు అండగా నిలిచారని బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన వెంటనే మొదటి స్థానం తనకు ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. జగన్‌కు తమ కుటుంబం మొత్తం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. తన తండ్రి స్థానంలో ఖాళీ అయిన ఎంపీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయం సాధించడానికి కృషి చేస్తామన్నారు.

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున బల్లి దుర్గా ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చనిపోయారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1994, 1999, 2009లో నాలుగుసార్లు గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి 2.28 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరోవైపు బీజేపీ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. గతంలో తిరుపతి నుంచి ఓ సారి బీజేపీ గెలుపొందింది. అలాగే, ఇటీవల తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో అదే ఉత్సాహాన్ని తిరుపతిలో కూడా కంటిన్యూ చేయాలని బీజేపీ భావిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 20, 2020, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading