ఏపీలో బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్న జగన్ సర్కార్..

AP Government : భూ రికార్డుల ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు నేటి నుంచి ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురితో కూడిన బృందం భూ రీ సర్వే చేయనుంది.

news18-telugu
Updated: February 18, 2020, 7:02 AM IST
ఏపీలో బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్న జగన్ సర్కార్..
వైఎస్ జగన్ (ఫైల్)
  • Share this:
భూ రికార్డుల ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు నేటి నుంచి ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురితో కూడిన బృందం భూ రీ సర్వే చేయనుంది. అప్పుడెప్పుడో 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ సర్వే రిజిష్టర్ ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పటి నుంచి నేటి వరకు తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడం వల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడం వల్ల సబ్‌డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి.

ఈ నేపథ్యంలో భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తూ రీసర్వేకు సిద్ధమైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలట్‌ ప్రాజెక్టుకు ఈ రోజు శ్రీకారం చుట్టనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేటలో బేస్‌ స్టేషన్‌ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీ సర్వే పైలట్‌ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభించనున్నారు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు