YS Sharmila: అన్నతో విబేధాలపై షర్మిల క్లారిటీ..? కన్నీరు వస్తోంది అంటూ భావోద్వేగ ట్వీట్.. ఏం చెప్పారంటే..?

ఒకే దగ్గర షర్మిల జగన్

YS Sharmila Tweet: వైఎస్ షర్మిల ఒంటరి అయ్యారా..? కన్నీరు ఆపుకోలేకపోతున్నారా..? ఈ మాట స్వయంగా ఆమె అంటోంది.. అది కూడా తండ్రి వర్ధంతి రోజు.. అన్న పక్కనే ఉండి పలకరించలేదనే ఇలా అన్నారా? లేక వేరే కారణాలు ఉన్నాయా.?

 • Share this:
  YS Family Politics:  వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి (YSR Rajasekhar Reddy)రాజకీయ వారసులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మధ్య విబేధాలు తారా స్థాయికి చేరయన్నదానిపై నేడు పూర్తి క్లారిటీ వచ్చింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందంటూ ప్రచారం జరుగుతున్నా.. అలాంటిది ఏం లేదు.. కేవల రాజకీయ విభేదాలే అంటూ వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. జులై 8న వైఎస్ జయంతి రోజున జగన్-షర్మిల ఒకరికి ఒకరు ఎదురు పడకుండా నివాళులర్పించారు. ఆ తరువాత రాఖీ పండగ రోజు అయినా అన్నా చెల్లి కలుస్తారని అంతా అనుకున్నారు కానీ.. ఆ రోజు రాఖీ కట్టడానికి షర్మిల అన్న జగన్ దగ్గరకు వెళ్లలేదు. అయితే వర్దంతి రోజూ ఇద్దరూ నివాళులర్పించడానికి.. ఇద్దరూ ఒకేసారి ఇడుపులపాయలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి నివాళులర్పించారు. అన్న చెల్లి ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు. దీంతో అది చూసిన వారంతా అన్నా దమ్ములు ఇద్దరూ కలిసే ఉన్నారు అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితి వేరు. తండ్రి సమాధి దగ్గర ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నా కనీసం పలకరించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తండ్రి వర్థంతి రోజు ఆయన్ని స్మరించుకుంటూ షర్మిల చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్‌టాపి‌క్‌గా మారింది. ఇద్దరి మధ్య వివాదాలకు క్లారిటీ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది.

  తండ్రి వర్ధంతి సందర్భందగా ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ అండ్ మిస్ యూ డాడ్ అంటూ షర్మిల తన ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ రూపంలో తన మనసులో బాధను వైఎస్ షర్మిల చెప్పేశారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీన్ని బట్టి చూస్తే.. సోదరుడు జగన్‌తో మనస్పర్థలున్నాయన్న విషయం ఎవరికైనా స్పష్టంగానే అర్థమైపోతుంది. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది.

  తండ్రిపై ఉన్న అనుబంధంతో భావోద్వేగంగా ట్వీట్ చేశారు తప్పా.. అందులో వేరే అర్థం లేదని కొందరు వాధిస్తున్నారు. అయితే వైఎస్సార్ జయంతి రోజున, రాఖీ పండుగ రోజున కూడా అన్నా, చెల్లి ఇద్దరూ కలవలేదు. దీంతో అప్పట్లో మీడియాలో పెద్ద చర్చే జరిగింది.

  తాజాగా ఇద్దరూ ఇడుపులపాయలో కలుసుకుని.. పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకర్ని ఒకరు పలకరించకోలేదు. ఇవాళ్టితో ఇద్దరి మధ్య ఉన్న విబేధాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని.. కచ్చితంగా ఇద్దరూ మాట్లాడుకుంటారని.. ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందని అభిమానులు, వైఎస్ అనుచరులు అనుకున్నప్పటికీ.. అవేమీ అస్సలు జరగలేదు.
  Published by:Nagesh Paina
  First published: