ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్లో హిందూత్వంపై వ్యవస్థీకృతమైన దాడి జరుగుతోందని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘వివేకా గారు చనిపోతే ముందు గుండెపోటు అన్న దొంగ బ్యాచ్ తరువాత బాబాయ్ ని చంద్రబాబు, లోకేష్ చంపేసారు. దీని పై సీబీఐ వెయ్యాలి అని చిల్లర హడావిడి చేసారు. తీరా అధికారంలోకి వచ్చాక బాబాయ్ ని లేపేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే అనే విషయం బయటపడకుండా సీబీఐ విచారణ అడ్డుకోవడానికి కుట్ర పన్నారు. అధికారంలో ఉండి దద్దమ్మ ఆరోపణలు చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో ఆర్గనైజ్డ్ గా హిందుత్వం పై దాడి జరుగుతుంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం, దేవతా విగ్రహాలు ధ్వంసం, 60 వేలకోట్ల విలువైన మాన్సాస్ భూములు మింగడం, అంతర్వేది లో రథం తగలబెట్టడం అందులో భాగమే. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన జగన్ రెడ్డి మతాల మధ్య చిచ్చుపెడుతున్నాడు. రధాన్ని కాల్చింది పిచ్చోడు, తేనెటీగలన్న సాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ పై విషం కక్కుతున్నాడు. సాయిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి నాలుగు తగిలిస్తే లోటస్ పాండ్ వేదికగా హిందుత్వం పై జరుగుతున్న కుట్ర బయటపడుతుంది.’ అంటూ ట్వీట్లు చేశారు.
వివేకా గారు చనిపోతే ముందు గుండెపోటు అన్న దొంగ బ్యాచ్ తరువాత బాబాయ్ ని చంద్రబాబు,లోకేష్ చంపేసారు.దీని పై సీబీఐ వెయ్యాలి అని చిల్లర హడావిడి చేసారు.తీరా అధికారంలోకి వచ్చాకా బాబాయ్ ని లేపేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే అనే విషయం బయటపడకుండా సీబీఐ విచారణ అడ్డుకోవడానికి కుట్ర పన్నారు.
అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దీని వెనక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని బీజేపీ, జనసేన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై నిజానిజాలను వెలికి తీయడంలో ఏపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని టీడీపీ మండిపడుతోంది. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పటికీ రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రథ దగ్ధం ఘటన వెనుక చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ప్రవాస ఆంద్రుడిలా హైదరాబాద్లో ఉంటూ ఏపీలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
''రథం దగ్ధం వ్యవహారంలో చంద్రబాబు హస్తముంది. హైదరాబాద్లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్ వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకుంటున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు కోరాం. త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుంది.'' అని విజయసాయిరెడ్డి అన్నారు. దీనిపై అయ్యన్న స్పందించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.