Home /News /politics /

CM Jagan-YS Sharmila: ఒకే వేదికపై జగన్-షర్మిల.. అనుమానాలు పెంచిన వైఎస్ఆర్ వర్ధంతి

CM Jagan-YS Sharmila: ఒకే వేదికపై జగన్-షర్మిల.. అనుమానాలు పెంచిన వైఎస్ఆర్ వర్ధంతి

ఒకే దగ్గర షర్మిల జగన్

ఒకే దగ్గర షర్మిల జగన్

YS jagan and sharmila: తండ్రి వైఎస్ వర్ధంతి అన్న జగన్, చెల్లి షర్మిలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. కానీ ఇద్ది మధ్య విభేదాలపై అనుమానాలను మరింత పెంచింది.. కారణం ఏంటో తెలుసా..?

  YS Family Politics: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy) రాజకీయ వారసులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)రాజకీయ విభేదాలతో ఇద్దరూ దూరం దూరంగా ఉంటున్నారు. ఎవరి పార్టీని వారు చూసుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య కేవలం రాజకీయ విభేదాలే కాదు.. వ్యక్తిగతంగా కూడా దూరం ఉందంటూ చాలా రోజుల నుంచి ప్రచాచంలో ఉంది. అందుకు తగ్గట్టే అప్పటి నుంచి నేటి వరకు వారి ఇద్దరి ఒకరికి ఒకరు ఎదురుపడింది. లేదు దూరంగా ఉండేలా షెడ్యూల్ మార్చుకుంటూ వచ్చారు కూడా. ఇటీవల రాఖీ పండుగ రోజున కూడా షర్మిల అన్నకు రాఖీ కట్టలేదు. కేవలం సోషల్ మీడియా వేదికంగా శుభాకాంక్షలు మాత్రమే చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ నిజమే అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఇవాళ వైఎస్ఆర్ 12 వ వర్ధతి.. ఈ సంరద్భంగానైనా ఇద్దరు కలుస్తారా..? లేక దూరం దూరం అంటారో చూడాలన్న అంశం అందరిలో ఆసక్తి పెంచింది. అయితే షర్మిల రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇద్దరి మధ్య విబేధాలు లేవని అందరికీ తెలిసేలా చేయాలన్ని విజయమ్మ ఆరాట పడుతున్నారు. అందుకే ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా అన్న, చెల్లి ఇద్దర్నీ ఒప్పించే ఒకే సమయానికి నివాళులర్పించేలా చేయగలిగారు. దీంతో అన్నా-చెల్లి ఒకే వేదిక మీదకు వచ్చారు. తండ్రి వైఎస్సార్ ఘాట్ సాక్షిగా ఇద్దరూ కలిసే వైఎస్సార్ ను నివాళి అర్పించారు. ప్రార్ధనల్లో పక్క పక్కనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

  అయితే ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని నివాళులర్పించినా.. వైఎస్ అభిమానుల్లో అనుమానాలను ఇంకాస్త రెట్టింపు చేశారు. ఇద్దరూ పక్క పక్కనే ఉన్న పలకరింపులు.. కాదు కనీసం ఒకర్ని ఒకరు చూసుకోలేదు కూడా. నివాళులర్పించిన సందర్భంగా ఎవరికి వారు దూరంగా ఉంటూనే తండ్రి సమాధికి పూల దండలు వేశారు.

  నివాళులర్పించిన తరువాత కూడా ఎవరికి వారు దూరంగానే ఉన్నారు. అసలు మాటల్లేవ్ అన్నట్టు పలకించలేదు కూడా. విజయమ షర్మిల ఒక దగ్గర ఉంటే.. జగన్ వేరే చోటు కనిపించారు. అక్కడకు వచ్చిన వారు కూడా రెండు గ్రూపులుగానే.. కొందరు జగన్ వెంట ఉంటే.. మరికొందరు షర్మిల వెంట కనిపించారు..

  సీఎం జగన్-షర్మిల దూరంగానే ఉండడం కాదు.. సీఎంతో పాటు హాజరైనా వైసీపీ నేతలు సైతం షర్మిలను పలకరించలేదు. ఎమ్మెల్యే చెవెరిడ్డి పక్కనే ఉన్న ఆయన కూడా కనీసం షర్మిలవైపు చూడలేదు. అక్కడి వ్యవహారం చూసిన ఎవరికైనా ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నది నిజమే అని అర్థం అవుతుంది..

  కేవలం రాజకీయ విభేదాలే అయితే.. జగన్ -షర్మిల దూరంగా ఉండొచ్చు.. అయితే జగన్ భార్య భారతి కూడా షర్మిలకు దూరంగానే ఉన్నారు. షర్మిల,విజయమ్మ ఒక దగ్గర ఉంటే.. భారతి మాత్రం వేరే చోటు కనిపించారు. విజయమ్మ వారిద్దర్నీ ఒకే దగ్గర కలిసి ఉంచేందుకు ప్రయత్నించినా ఎవరికి వారు అన్నట్టే వ్యవహరించారు..

  తండ్రి వర్ధంతి అన్న చెల్లె ఇద్దర్నీ పక్కన కూర్చోబెట్టినా.. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నది బహిర్గం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న వైఎస్ వర్ధంతి సభకు ఎవరెరెవరు హాజరవుతారన్నది ఆసక్తిగా మారింది.

  మరోవైపు సీఎం జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికన ఓ పోస్టు చేశారు వైఎస్ జగన్.. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది.” అంటూ ట్వీట్ చేశారు.  మరోసారి ఇడుపులపాయ వేదికగా ఇద్దరి మద్య దూరం ఉంది అన్నది బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న  వైఎస్ఆర్ సంస్మరణ సభ ఎలాంటి సంకేంతాలు ఇస్తుందో  చూడాలి..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, YS Sharmila, YS Vijayamma, YSR

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు