ప్రగతిభవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు ఆరున్నర గంటల పాటు వీరి సమావేశం కొనసాగింది. ఇరువురు సీఎంలు రెండు గంటల పాటు ఏకాంతగా చర్చించారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలతో పాటు విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఉద్యోగులు, డీఎస్పీల విభజన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై ఉమ్మడి ప్రణాళిక కోసం మరోసారి సమావేశం కావాలని కేసీఆర్, జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రగతి భవన్లో జరిగిన సమావేశానికి ఏపీ సీఎం జగన్తో పాటు ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.