Home /News /politics /

YOUTH SHOULD PARTICIPATE IN GRAM PANCHAYATH ELECTIONS SAYS JANASENA CHIEF PAWAN KALYAN SK

Pawan Kalyan: మీరే మీ ఊరి సర్పంచ్.. యువతకు పవన్ కల్యాణ్ పిలుపు

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

AP Gram Panchayat Elections: యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునే అద్భుత అవకాశం రాబోతోందని.. యువత పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ఏపీలో పంచాతీయ ఎన్నికల వేడి రాజుకుంది. తొలిదశ ఎన్నికలకు ఇప్పటికే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేపట్టింది. ఎన్నికల సంఘానికి అధికారులు, ఉద్యోగులెవరూ సహకరించడం లేదు. ఎన్నికల విషయంలో ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాటల మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పైరేపు సుప్రీంకోర్టు విచారించనుంది. పంచాయతీ ఎన్నికలపై ఇంత రచ్చ జరుగుతుంటే మరోవైపు విపక్షాలు మాత్రం ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. పంచాయతీ పోరుపై దృష్టిపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునే అద్భుత అవకాశం రాబోతోందని.. యువత పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ''మన గ్రామాలను అభివృధ్ధి చేసుకునే గొప్ప అవకాశం రాబోతోంది. ఏపీలో 18-35 ఏళ్ల వయసున్న వారు 68 లక్షల మంది ఉన్నారు. పంచాయతీ పాలనను సుపరిపాలనగా మార్చాలనుకుంటే యువత ముందుకు రావాలి. పంచాయతీ ప్రగతికి దిశానిర్దేశం చేసి, మంచి ఫలితాలు సాధించగలిగే శక్తి సామర్థ్యాలు ఏపీలోని యువతలో పుష్కలంగా ఉన్నాయి. యువత భవిష్యత్ నాయకులుగా రూపుదిద్దడం జనసేన ముఖ్య ఆశయాల్లో ఒకటి. ఈ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి. మన గ్రామాలను, రాష్ట్రాలు, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్న ఆలోచనలు ఉన్న యువతీ యువకులు పంచాయతీ ఎన్నిల్లో పాల్గొనాలి. వారికి జనసేన తరపున మద్దతు అందజేస్తాం.'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


    కాగా, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన 11 జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి విడతకు జనవరి 25 నుంచి నామినేషన్ల స్వీకరించనుండగా.. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎన్నికల జాబితా సకాలంలో అందించడంలో పంచాయతీరాజ్ అధికారులు విఫలమయ్యారని అన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు నిమ్మగడ్డ.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Gram Panchayat Elections, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు