• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YOUTH ASKS ABOUT JOBS GOVT ASKS THEM TO WATCH MOON SAYS RAHUL GANDHI MS

యువత జాబ్స్ అడుగుతుంటే.. మోదీ చందమామను చూపిస్తున్నారు : రాహుల్

యువత జాబ్స్ అడుగుతుంటే.. మోదీ చందమామను చూపిస్తున్నారు : రాహుల్

రాహుల్ గాంధీ (File Photo)

నోట్ల రద్దు వల్ల ఎవరికి ఏం ఒరిగిందని రాహుల్ ప్రశ్నించారు. నీరవ్ మోదీ లాంటి దేశం దాటి పారిపోయారని గుర్తుచేశారు. నోట్ల రద్దు వల్ల ఎవరికీ ఎలాంటి లాభం జరగకపోతే నన్ను శిక్షించండి అన్న మోదీ ఇప్పుడేమంటారని నిలదీశారు.

  • Share this:
    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. దేశ యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే.. మోదీ మాత్రం ఆకాశంలో చందమామను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రయాన్-2 ప్రాజెక్టుని తెర పైకి తీసుకొచ్చి.. చాలా అంశాలపై చర్చను మరుగునపడేశారని విమర్శించారు. చందమామ పైకి రాకెట్‌ని పంపించినంత మాత్రాన పేదల ఆకలి తీరదని విమర్శించారు. ఆర్టికల్ 370,చందమామల గురించి మాట్లాడుతూ వేరే అంశాలకు ప్రాధాన్యం దక్కకుండా చేశారన్నారు. ఈ విషయంలో మీడియాను కూడా ఆయన తప్పు పట్టారు. రైతు సమస్యలు,నిరుద్యోగ సమస్యలపై మీడియా మౌనం వహిస్తోందని ఆరోపించారు. ఓవైపు 15మంది సంపన్నులకు చెందిన రూ.5.5లక్షల కోట్ల అప్పులను మాఫీ చేసిన నరేంద్ర మోదీ సర్కార్.. రైతు సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆదివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    నోట్ల రద్దు వల్ల ఎవరికి ఏం ఒరిగిందని ప్రశ్నించారు. నీరవ్ మోదీ లాంటి దేశం దాటి పారిపోయారని గుర్తుచేశారు. నోట్ల రద్దు వల్ల ఎవరికీ ఎలాంటి లాభం జరగకపోతే నన్ను శిక్షించండి అన్న మోదీ ఇప్పుడేమంటారని నిలదీశారు. జీఎస్టీ తీసుకొచ్చిందే.. పేదలను కొట్టి బడా బాబులకు దోచి పెట్టడానికి అని విమర్శించారు.
    Published by:Srinivas Mittapalli
    First published: