పోలీసులే చంపితే ఇక కోర్టులెందుకు.. బీజేపీ నేత ప్రశ్నలు

Shdadnagar encounter: న్యాయ ప్రక్రియ పూర్తి కాకముందే కాల్చి చంపితే.. ఇక కోర్టులు, న్యాయ, పోలీస్ వ్యవస్థలు ఎందుకు? అని అన్నారు.

news18-telugu
Updated: December 6, 2019, 12:28 PM IST
పోలీసులే చంపితే ఇక కోర్టులెందుకు.. బీజేపీ నేత ప్రశ్నలు
Shdadnagar encounter: న్యాయ ప్రక్రియ పూర్తి కాకముందే కాల్చి చంపితే.. ఇక కోర్టులు, న్యాయ, పోలీస్ వ్యవస్థలు ఎందుకు? అని అన్నారు.
  • Share this:
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై దేశం నలుమూలల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసులకు జై కొడుతూ.. ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. పలు పార్టీల నేతలు సైతం పోలీసుల చర్యను స్వాగతిస్తున్నారు. ఇలాంటివి జరిగితేనే దేశంలో మహిళల పట్ల అఘయిత్యాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. కానీ కొందరు మాత్రం తెలంగాణ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ చేరారు.

పార్లమెంట్ ఆవరణలో మేనకా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ''హైదరాబాద్‌లో జరిగిన ఘటన చాలా భయానకమైది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. మీకు చంపాలనిపించిందని కాల్చి చంపడం కరెక్టు కాదు. నిందితులకు కోర్టుల ద్వారానే కఠిన శిక్షలు పడాలి. న్యాయ ప్రక్రియ పూర్తి కాకముందే కాల్చి చంపితే.. ఇక కోర్టులు, న్యాయ, పోలీస్ వ్యవస్థలు ఎందుకు?''. అని అన్నారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>