Home /News /politics /

ఆయన కృష్ణుడు..నేను అర్జునుడిని: బీజేపీ ఎంపీ రవి కిషన్

ఆయన కృష్ణుడు..నేను అర్జునుడిని: బీజేపీ ఎంపీ రవి కిషన్

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో గోరఖ్ పూర్ ఎంపీ నటుడు రవి కిషన్ శుక్లా (file Photo)

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో గోరఖ్ పూర్ ఎంపీ నటుడు రవి కిషన్ శుక్లా (file Photo)

    ఉత్తర భారతదేశంలో గోరఖ్‌పూర్‌ను అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుతానని ఎంపీ, భోజ్‌పుని నటుడు రవికిషన్ అన్నారు. గోరఖ్‌పూర్ శరవేగంగా విస్తరిస్తోందని...ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన రవి కిషన్.. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన కృష్ణుడైతే తాను అర్జునుడినని చెప్పుకొచ్చారు.

    యోగి ఆదిత్యనాథ్‌ నా కృష్ణుడు. నేను ఆయన అర్జునుడిని. యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలో గోరఖ్‌పూర్‌ అభివృద్ధికి కృషి చేస్తా. ఉత్తర భారతంలో అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుతా. గోరఖ్‌పూర్‌‌లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఆరు ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంది. దీనిపై కేంద్రమంత్రి గడ్కరీకి లేఖ రాశా. త్వరలో ఇక్కడి ప్రజలు శుభవార్త వింటారని ఆశిస్తున్నా. గోరఖ్‌పూర్‌లో ఫిల్మ్‌సిటీని అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
    రవి కిషన్, ఎంపీ
    లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన రవికిషన్ 3లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. యూపీ సీఎం యోగి వరసగా ఐదుసార్లు గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన యూపీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత 2017 గోరఖ్‌పూర్ లోక్‌సభకు ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీచేయడంతో బీజేపీ ఓటమి పాలయింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించింది.
    First published:

    Tags: Ravi kishan, Uttar pradesh, Yogi adityanath

    తదుపరి వార్తలు