యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. లవ్ జీహాద్ బిల్లు ఆర్డినెన్స్ కు ఆమోదం

ఉత్తర ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యానాథ్(Yogi Adithyanath) సర్కార్ ఈ రోజు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లవ్ జీహాద్(Love Jihad)కు వ్యతిరేకంగా రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బలవంతపు మత మార్పిడులకు అడ్డుకునేందుకే ఈ మేరకు చట్టం చేసినట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

news18-telugu
Updated: November 24, 2020, 10:03 PM IST
యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. లవ్ జీహాద్ బిల్లు ఆర్డినెన్స్ కు ఆమోదం
యోగీ ఆదిత్యానాథ్(ఫైల్ ఫొటో)
  • Share this:
ఉత్తర ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యానాథ్ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. బలవంతపు మత మార్పిడులకు అడ్డుకునేందుకే ఈ మేరకు చట్టం తీసుకువస్తున్నట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా యూపీ మంత్రి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఒకరు బలవంతపు మతమార్పిడికి పాల్పడినట్లు తేలితే వారికి 1-5 ఏళ్ల జైలు శిక్షతో ఉంటుందని తెలిపారు. జైలు శిక్షతో పాటుగా రూ.15 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలు, మైనార్టీలు మతమార్పిడికి పాల్పడితే మూడు నుంచి పదేళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధిస్తారని వెల్లడించారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తీసుకు వస్తామని గత నెలలో జౌన్‌పూర్ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారు.

ప్రేమ పేరుతో జ‌రుగుతున్న మ‌త మార్పిళ్ల‌కు అరికట్టడానికి ఈ ఆర్డినెన్స్‌ను యోగీ సర్కార్ తీసుకువచ్చింది. హిందూ యువ‌తుల‌కు ప్రేమ పేరుతో వ‌ల వేసి, వాళ్ల‌ను మ‌తం మారేలా ఒత్తిడి తెస్తున్నార‌ని కొన్ని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీన్నే ల‌వ్ జిహాద్ అన్న పేరుతో పిలుస్తున్నారు. ఈ బిల్లును రానున్న శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Published by: Nikhil Kumar S
First published: November 24, 2020, 9:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading