#YogiToNews18: దేశమంతటా NRC.. అమిత్ షా‌ ఫార్ములాకు యోగి మద్దతు

కొన్నేళ్ల క్రితం ఎంతో మంది విదేశీయులు భారత్‌లోకి చొరబడి.. మన వనరులను కొల్లగొట్టారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అలాంటి వారితో దేశ సమగ్రతకు ముప్పు పొంచి ఉందని.. వారందరినీ దేశం నుంచి పంపించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: September 19, 2019, 5:19 PM IST
#YogiToNews18: దేశమంతటా NRC.. అమిత్ షా‌ ఫార్ములాకు యోగి మద్దతు
యోగితో న్యూస్ 18 ఇంటర్వ్యూ
news18-telugu
Updated: September 19, 2019, 5:19 PM IST
అసోం NRCపై ఇప్పటికే దుమారం రేగుతోంది. దేశంలో పుట్టిన పెరిగిన ఎంతో మంది పౌరుల పేర్లు జాతీయ పౌర పట్టీ (NRC)లో గల్లంతయ్యాయని అస్సామీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి అండగా నిలిచిన టీఎంసీ సహా పలు పార్టీలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోం మాత్రమే కాదు.. దేశమంతటా NRCని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అమిత్ షా ప్రతిపాదనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జైకొట్టారు. న్యూస్‌18 నెట్‌వర్క్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో NRC అంశంపై మాట్లాడారు యోగి.

అంతర్గత భద్రత సమస్యపై కేవలం యూపీయే కాదు యావత్ దేశం పోరాడుతోందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఎంతో మంది విదేశీయులు భారత్‌లోకి చొరబడి.. మన వనరులను కొల్లగొట్టారని ఆయన అన్నారు. అలాంటి వారితో దేశ సమగ్రతకు ముప్పు పొంచి ఉందని.. వారందరినీ దేశం నుంచి పంపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడ్డారన్నారు న్యూస్ 18 ఇంటర్వ్యూలో పేర్కొన్నారు యోగి.

బీజేపీ ప్రభుత్వం అసోం తరహాలోనే దేశమంతటా NRCని అమలు చేస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న వారందరిపైనా చర్యలు తీసుకుంటాం. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపిస్తేనే దేశ సమగ్రత బలపడుతుంది.
యోగి ఆదిత్యనాథ్


కాగా, ఆగస్టు 31న అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (NRC) తుది జాబితా విడుదలయింది. అందులో 3.11 కోట్ల మంది చోటు దక్కగా..19.6 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. NRCలో పేరు లేని ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఐతే NRCలోని పేరులేని వారిని వెంటనే విదేశీయులుగా ప్రకటించరు. తమకు అన్యాయం జరిగిందని భావించిన వాళ్లు ఫారిన్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించవచ్చు. అందుకోసం వారికి 120 రోజుల గడువు విధించారు. అసోంలో ఇప్పటికే 400 ఫారిన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది కేంద్రం.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...