సుప్రీం అక్షింతలు...యోగి ఆదిత్యనాథ్, మాయావతి ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాజ్ఞలు

ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ 72 గం.లు, మాయావతి 48 గం.లు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది.

news18-telugu
Updated: April 15, 2019, 4:01 PM IST
సుప్రీం అక్షింతలు...యోగి ఆదిత్యనాథ్, మాయావతి ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాజ్ఞలు
యోగి ఆదిత్యనాథ్, మాయావతికి ఈసీ షాక్(న్యూస్18 క్రియేటివ్ ప్రత్యేకం)
news18-telugu
Updated: April 15, 2019, 4:01 PM IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న రాజకీయ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు నిలదీయడం తెలిసిందే. దీంతో ఆలస్యంగానైనా కేంద్ర ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలపై చర్యలు తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ 72 గంటలు, మాయావతి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ తన ప్రకటనలో తెలిపింది.

Yogi Adityanath, Mayawati, election code, campaign ban, central election commision, election news, cec, యోగి ఆదిత్యనాథ్, మాయావతి, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు
యోగి ఆదిత్యనాథ్(ఫైల్ ఫోటో)


ఈ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 72 గంటల పాటు యోగి ఆధిత్యనాథ్ ఎలాంటి బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు... మీడియా సమావేశాల్లోనూ పాల్గొనకూడదు. అలాగే మంగళవారం ఉదయం నుంచి 48 గంటల పాటు ఇవే షరతులు మాయావతికి కూడా వర్తిస్తాయి. భారత ఆర్మీ జవాన్లను ‘మోడీ సేన’గా యోగి ఆదిత్యనాథ్ ఘజియాబాద్ ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలకు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఆయనపై ఈ చర్యలు తీసుకుంది.

Yogi Adityanath, Mayawati, election code, campaign ban, central election commision, election news, cec, యోగి ఆదిత్యనాథ్, మాయావతి, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు
బీఎస్పీ అధినేత్రి మాయావతి
అంతకు ముందు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న నేతలపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ఈసీని సుప్రీం నిలదీసింది. ఈ విషయంలో రాజకీయ నేతలను దారిలో పెట్టేందుకు మీకున్న విచక్షణాధికారల గురించి మీకు తెలుసా? తెలియదా? అంటూ సూటిగా ప్రశ్నించింది.
First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...