Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ఆ ఛానల్ వెబ్‌సైట్‌పై చర్యలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం..

    సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు.

    Shravan Kumar Bommakanti | news18-telugu
    Updated: July 25, 2019, 12:23 PM IST
    ఆ ఛానల్ వెబ్‌సైట్‌పై చర్యలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం..
    అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయని, అర్చకుల కోరిక‌ మేరకు వారికి ప్రత్యేకంగా గదులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశించినట్లు తెలిపారు.
    • Share this:
    శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, వారిని రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఓ ఛానల్‌కు చెందిన వెబ్‌సైట్‌లో టీటీడీపై తప్పుడు వార్తలు రాశారని, బోర్డు డీఈవోగా క్రిస్టోఫర్ అనే వ్యక్తిని నియమించారంటూ తప్పుడు వార్తను పోస్ట్ చేశారని ఆయన గ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారాలు చేస్తున్నారని, సంబంధిత వెబ్‌సైట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను వారు స్వాగతించలేకపోతున్నారని, దేవుడి ముందు అందరూ సమానులేనని తాము నిరూపిస్తుంటే ఆ చర్యలను జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 50 రోజుల్లో టీడీపీ మరింత దిగజారిందని విమర్శించారు.

    సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్ఠను, వైఎస్ జగన్‌ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమ చేతిలో ఉన్న ఎల్లోమీడియాను వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని, ఇలా విషప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
    Published by: Shravan Kumar Bommakanti
    First published: July 25, 2019, 12:22 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading