• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • YCP WON GRATER VISAKHA MUNICIPAL ELECTIONS WHO WILL BE MAYOR CANDIDATE NGS

AP Municipal Elections: ఉత్కంఠ రేపిన విశాఖ కార్పొరేషన్ వైసీపీ సొంతం.. రెండు చోట్ల మాత్రమే విశాఖ ఉద్యమం ఎఫెక్ట్

ఫ్రతీకాత్మక చిత్రం

విశాఖ ఉద్యమ ప్రభావం ఉంటుంది అన్నారు.. స్థానికంగా టీడీపీ చాలా బలంగా ఉందు అంటూ అంచనాలు వేశారు. కానీ ఆ లెక్కలు అన్నీ తప్పాయి . ఎంతో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఫలితాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే రెండు చోట్ల మాత్రం స్టీల్ ప్లాంట్ ఉద్యమ ప్రభావం కనిపిచింది. ఆ రెండు వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులకు షాక్ తగిలింది.

  • Share this:
    ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. అందరిలో ఉత్కంఠ పెంచింది విశాఖ కార్పొరేషన్ మాత్రమే.. అధికార పార్టీ ఈ మున్సిపాలిటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది ప్రభుత్వం.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగించేందుకు జగన్ సిద్ధమయ్యారు కూడా. ఇలాంటి సమయంలో విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక్కడ నుంచి పరిపాలన చేసేందుకు స్థానికంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. దానికి తోడు విశాఖను రాజధాని చేయడం స్థానిక ప్రజలకు ఇష్టం లేదనే వాదన మొదలవుతుంది.

    మరోవైపు విశాఖ ఉద్యమం ఎఫెక్ట్ కూడా ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని అంతా భావించారు. ఎందుకంటే ఎన్నికలకు ఒక్క రోజు ముందే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వందశాతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని తేల్చి చెప్పేశారు. దానికి తోడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించే చేస్తున్నామన్నట్టు చెప్పారు. దీంతో కార్మిక, విద్యార్థి సంఘాలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దీంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుంది అనుకున్నారు. దానికి తోడు ఓటింగ్ భారీగా పెరగడంతో అధికార పార్టీ నేతల్లోనూ కాస్త టెన్షన్ మొదలైంది.

    అయినా ఫలితాలు మాత్రం వైసీపీకే అనుకూలంగా వచ్చాయి. విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ భారీ విజయంతో కైవసం చేసుకుంది. మొత్తం 55 డివిజన్లలో వైసీపీ గెలుపొందగా.. టీడీపీ- 29 చోట్ల, జనసేన-04, ఇతరులు-06 స్థానాల్లో గెలుపొందారు. అయితే విశాఖ కార్పొరేషన్ పై జనసేన-బీజేపీ కూటమి భారీగానే ఆశలు పెట్టుకుంది. యూత్ ఓటర్లు అత్యధికంగా ఉండడం.. అలాగే నార్త్ స్టేట్స్ కు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడ తమకు అనుకూలిస్తుంది అనుకున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎఫెక్ట్ మాత్రం ఈ కూటమిపై పడింది. అందుకే సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వాల్సి వచ్చింది..

    రాష్ట్ర ప్రభుత్వంపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ ప్రభావం పెద్దగా చూపించకపోయినా.. రెండు వార్డుల్లో మాత్రం ఆ ప్రభావం పడింది. అందుకే మేయర్ రేసులో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి కోడలు ఓటమి పాలయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాకలోని రెండు వార్డుల్లో.. విశాఖ ఉద్యమానికి మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఈ రెండు చోట్ల మాత్రమే విశాఖ ఉక్కు ఉద్యమ ప్రభావం కనిపించింది. అందుకే అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. మరోవైపు కౌంటింగ్ సందర్భంగా చాలా చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో కొన్ని స్లిప్పులు దర్శనమిచ్చాయి. ఆ స్లిప్పులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం రాసి ఉంది. దీంతో తమ సెంటిమెంట్  ను రాజకీయ పార్టీలకు తెలిసేలా చేయగలిగారు కొందరు కార్మికులు. అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమ ప్రభావం కేంద్రం ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పైన పడింది కానీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.
    Published by:Nagesh Paina
    First published: