YCP VIJAYA SAI REDDY ON SUSPICIOUS DEATH OF YS VIVEKANANDA REDDY SB
పరిసరాలు చూస్తే అనుమానంగా ఉన్నాయి... వివేకానందరెడ్డి మృతిపై విజయసాయిరెడ్డి
విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీ
రక్తపు మడుగులో పడి ఉన్న వివేకానందరెడ్డిని గుర్తించిన ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు కల్గుతున్నాయన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని సమాచారం అందిందన్నారు కానీ పరిసరాలు చూస్తే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అందుకే అనుమానాస్పద మృతిగా భావించాల్సి వస్తుందన్నారు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబసభ్యులు లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో వివేకానందరెడ్డి ఇంటికి చేరుకోనున్నట్లు తెలిపారు. అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారన్నారు. ప్రస్తుతం వివేకానందరెడ్డి మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టమ్ నిర్వహించిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు విజయసాయిరెడ్డి. వివేకానంద రెడ్డి మృతి చెందిన సందర్భాల్లో ఎలాంటి రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. వివేకానందరెడ్డి అంత్యక్రియలు.. ఈ రోజు, లేదా రేపు జరగొచ్చని తెలిపారు.
శుక్రవారం తెల్లవారుజామున బాత్ రూంలో వివేకానందరెడ్డి మృతిచెందారు. అయితే ఆయన తలకు, చేతికి బలమైన గాయాలు అయినట్లుగా గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకానందరెడ్డిని గుర్తించిన ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.