YCP TDP FOCUS ON GUNTUR MUNICIPAL ELECTIONS GNT NGS
Municipal elections: 16 ఏళ్ల తరువాత గుంటూరు మున్సిపాలిటీకి ఎన్నికలు.. ఈ సారి గెలుపెవరిది?
ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు మేయరం పీఠం కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.. తొలిసారి రంగంలోకి దిగుతున్నా తమ జెండానే ఎగురుతుందని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు నెగ్గిన.. టీడీపీ ముచ్చటగా మూడోసారి గెలుపు తొడగొడతామంటోంది. 16 ఏళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికల్లో గెలుపెవరిది?
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ మున్సిపల్ ఎన్నికలపై పడింది. అయితే చాలా నగర పాలక సంస్థకు దశాబ్దాల తరువాత ఎన్నికలు జరుగుతుండడం విశేషం. గుంటూరు పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగి 16 ఏళ్లు దాటింది. ఇంతకాలం ఎందుకు ఎన్నికలు జరగలేదు. 16 ఏళ్లు అంటే కనీసం మూడు ప్రభుత్వాలు మారాయి.. అయినా ఎందుకు ఎన్నికలు జరగలేదు.. గుంటూరు మున్సిపాలిటీకి ఏమైంది..?
రాష్ట్రంలోనే చెతన్యం గల నగరంగా గుంటూరుకు గుర్తింపు ఉంది. అత్యధిక జనభాగల నగరాలలో మూడోది. అంతే కాకుండా ఎంతోమంది రాజకీయ ఉద్దండులకు పుట్టినిల్లు కూడా. గుంటూరు నగరంలోని మిర్చి యార్డ్ ఆసియాలోనే అతి పెద్దదిగా గుర్తిపు తెచ్చుకొంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గుంటూరు నగరపాలక సంస్థకు పదహారు ఏళ్ల పాటు ఎందుకు ఎన్నికలు జరగలేదు.
1994 నుంచి ఇప్పటి వరకు మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రెండు పర్యాయాలు తెలు గుదేశం పార్టీ మేయర్ సీటును సొంతం చేసుకుంది. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2005 అక్టోబర్ 5న నగర మేయర్‌గా కన్నా నాగరాజు, డిప్యూటీ మేయర్‌గా తాడిశెట్టి మురళీమోహన్‌లు బాధ్యతలు చేపట్టారు. అప్పటి ఒప్పందం ప్రకారం 2008లో మేయర్, డిప్యూలీ మేయర్ పదవులకు వారు రాజీనామా చేశారు. దీంతో 2008 మే 3న నగర మేయర్‌గా రాయపాటి మోహన్‌సాయికృష్ణ, డిప్యూటీ మేయర్‌గా షేక్ గౌస్‌లు బాధ్యతలు చేపట్టారు. అయితే రెండున్నర సంవత్సరాల పాటు వీరిద్దరు మేయర్, డిప్యూటీ మేయర్‌గా కొనసాగారు. 2010 సెప్టెంబర్ 29న పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు.
గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికలలో 57 డివిజన్లకు 531 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలన తరువాత 555 నామినేషన్లకు ఆమోదం లభించింది. అయితే 13, 17 డివిజన్లలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మృతి చెందటంతో 28 వరకు నామినేషన్లకు అధికారులు గడువిచ్చారు. 2005 ఎన్నికల తర్వాత 15 ఏళ్ల పాటు గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. 2012లో గుంటూరు నగర పాలకసంస్థలో చుట్టూ పదిగ్రామాలను విలీనం చేశారు. 2014లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నిక లు జరగలేదు. అప్పట్లో వార్డుల పునర్ విభజన సక్రమంగా జరగలేదని పలువురు వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికలు నిలిచిపోయాయి. 2020లో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ కావడం, రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికలకు కార్పొరేషన్ ఇప్పుడు ఎన్నికలకు సన్నద్ధం అయ్యింది.
చాలా గ్యాప్ తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో తొలిసారి వైసీపీ పోటీ చేస్తోంది. తొలిసారే తమ జెండా రెపరెపలాడించాలని వైసీపీ ఆశిస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు సార్లు మేయర్ పదవి నెగ్గిన టీడీపీ.. ముచ్చటగా మూడో సారి కూడా తమదే విజయం అంటోంది. అమరాతి ఉద్యమం.. రాజధాని తరలింపు నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉంటాయని టీడీపీ నేతులు భావిస్తున్నారు.