HOME »NEWS »POLITICS »ycp reverse challenge to tdp on amaravathi issue prn

TDP vs YCP: చంద్రబాబు సవాల్ కు వైసీపీ ప్రతి సవాల్.. రాజధానిపై రాజకీయ రచ్చ

TDP vs YCP: చంద్రబాబు సవాల్ కు వైసీపీ ప్రతి సవాల్.. రాజధానిపై రాజకీయ రచ్చ
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాజధాని(Capital) రాజకీయం మరోసారి వేడెక్కింది. అమరావతి (Amaravathi) ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయం మరోసారి వేడెక్కింది. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. అమరావతిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. చంద్రబాబు చేసిన సవాల్ కు మేం రెడీ అంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రతి సవాల్ విసురుతున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు భ్రమలో బతుకుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ప్రతిపక్ష నేతకు పెద్ద పనిలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

    జగన్, కేసీఆర్ మాదిరిగా..


    చంద్రబాబు విసిరిన రిఫరెండం సవాల్ కు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు ఏం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశామని.. కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తరహాలో చంద్రబాబు పోరాటం చేయగలరా అని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్ తాము నమ్మిన దాని కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి గెలుపొందారని..చంద్రబాబుకు తాను చెప్పిన మాటలపై నమ్మకముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని సజ్జల సవాల్ విసిరారు.



    చంద్రబాబు దమ్ముంటే..
    ఇక బాబు కామెంట్స్ పై మంత్రి చెల్లుబోయిన వేణు కూడా ఘాటుగానే స్పందించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అధికారం తనదేనని చంద్రబాబు భ్రమల్లో బతుకుతున్నారని చెల్లుబోయిన వేణు అన్నారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మరో మంత్రి కొడాలి నాని ఇంకాస్త ఘాటుగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. అమరావతిపై రిఫరెండంలో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తాని సవాల్ విసిరిన చంద్రబాబు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే తాను రాజీనామా చేసి టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ గెలిస్తే రాజధాని అమరావతిలోనే ఉంటుందన్నారు.

    ఇదే అంశంపై విజయవాడ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. వైసీపీని నిలదీశారు. రాజధాని అంశంపై కృష్ణాజిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిని వ్యతిరేకిస్తున్నవారు రాజీనామా చేసి గెలవాలని గద్దె సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను కూడా అందుకు సిద్దమని ప్రకటించారు. మూడు రాజధానులకు ప్రజల మద్దతుంటే వైసీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేయాలని ఎంపీ కేశినేని నాని అన్నారు.

    సవాళ్లు ప్రతిసవాళ్లతో మరోసారి అమరావతి హాట్ టాపిక్ గా మారింది. మరి అధికార ప్రతిపక్షాలు తాము చేసిన సవాళ్లకు కట్టుబడి ఉంటాయా? లేదా? అనేది వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:December 18, 2020, 13:29 IST

    टॉप स्टोरीज