• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • YCP REBAL MP RAGHU RAMA KRISHNA RAJU FIRE ON YCP LEADERS THEY TRYING TO HONEY TRAP NGS

Andhra Pradesh: హనీ ట్రాప్ చేయాలి అనుకుంటున్నారా..? ఆ వలలో పడను అంటున్న వైసీపీ ఎంపీ

సజ్జలపై రఘురామ ఫైర్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు తనను విగ్గురాజా అంటూ హేళన చేస్తున్నారని.. తనకు జగన్ కు ఒక్కరే హెయిర్ కన్సల్టెంట్ అన్నారు. ఏపీలో సజ్జల షాడో హోం మినిస్టర్ గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • Share this:
  వైసీపీ పెద్దలంతా కలిసి తనను టార్గెట్ చేశారు అంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు మండిపడ్డారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఏయ్ సజ్జలా ఎవడ్రా నువ్వు అంటూ ఏకవచన పదజాలంతో విరుచుకు పడ్డారు. తనను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా మనుషులను నియమించారని.. సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సజ్జల సూచన మేరకు తనకు సుమారు ఒక వంద ఫోన్ కాల్స్ వస్తున్నాయి అన్నారు. జగన్ రెడ్డి అని సీఎం జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేను ఖాళీగా ఉంటానా రెడ్డీ. నీ దగ్గర నా మనుషులు కూడా ఉన్నారు అంటూ ఏక వచనంతో సంభోదించారు. సజ్జల... సారీ బిజ్జల దిశానిర్దేశంతో.. తనను అసహనానికి గురి చేసి కేసులు వేద్దామని ప్లాన్ చేసినట్టు వాళ్లు చెప్పారన్నారు.

  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పతనావస్థలో ఉందని. వారి కుట్రలను త్వరలోనే బయటపెడతాను అన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవాళ తన వ్యక్తిగత కార్యదర్శి వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని లేఖలో తెలిపాను అన్నారు. వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాను. తనను హనీ ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సజల్ల ఏపీలో అనధికార హోంమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళా హోంమంత్రికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నీ సజ్జలే చూస్తున్నారంటూ మండిపడ్డారు. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

  ఇప్పటికైన బుద్ధి తెచ్చుకోవాలని.. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దన్నారు. కోర్టులు ఉన్నాయి. ప్రభుత్వం వేస్తున్న అన్ని వేషాలు కనిపెడుతున్నాయన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహంకారం వద్దని సలహా ఇచ్చారు. చేతిలో రాష్ట్ర పోలీసులు ఉన్నారని రెచ్చిపోవద్దన్నారు. చంద్రబాబు మీద పెట్టినట్టు తనపై కేసులు పెడితే భయపడేది లేదన్నారు. తనను విగ్గురాజా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని.. కానీ సీఎం జగన్ కు తనకు ఒకరే హెయిర్ కన్సల్టెంట్ అంటూ సంచలన నిజాలుబయట పెట్టారు రఘురామ రాజు.

  ఎన్నికల ప్రచార సమయంలో జగన్ ప్రచారానికి సంబంధించిన (నేను విన్నాను.. నేను ఉన్నాను) వీడియో ప్లే చేసి మరీ మిమిక్రీ చేశారు ఎంపీ రఘురామ. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అన్న జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నారు. సుమారు 3678 వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసినప్పుడు తప్ప ఎప్పుడు కనిపించారు అంటూ ప్రశ్నించారు.
  Published by:Nagesh Paina
  First published: