వైసీపీ నేతల ఫిర్యాదు... స్పీకర్ కోడెలపై కేసు నమోదు

కోడెల శివప్రసాదరావు (File)

మరో 22మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు

  • Share this:
    గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ కేసు ఫైల్ చేశారు. కోడెల ఎన్నికల రోజు బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డరని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కోడెలను 7వ నిందితునిగా చేర్చిన పోలీసులు. ఆయనతో సహ మరో 22మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో పోలింగ్‌ బూత్‌ ఆక్రమణకు పాల్పడిన కోడెల శివప్రసాదరావు, అతని అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఇనిమెట్లలో కోడెలపై దాడి అంటూ టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు.

    ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలపై దాడి జరిగిందంటూ వార్త కలకలం రేగింది. కోడెల బట్టలు చిరిగేలా ఆయనపై వైసీపీ వర్గం దాడి చేసిందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. పోలింగ్ సమయంలో వైసీపీ నేతలు కోడెలపై దాడి చేశారంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ కోడెలయే స్వయంగా లోపలకి వెళ్లి తలుపులు వేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  పోలీసులు ఇనిమెట్లకు వెళ్లి సోదాలు చేసి పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
    First published: