జగన్‌పై వ్యతిరేక కథనాలు.. ఆందోళనలో వైసీపీ ఎంపీలు..

AP CM Jagan : విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో భాగంగా ఎంపీలు.. జాతీయ స్థాయిలో సీఎం పాలనపై వ్యతిరేకత వస్తోందని చెప్పారు.

news18-telugu
Updated: November 19, 2019, 5:43 PM IST
జగన్‌పై వ్యతిరేక కథనాలు.. ఆందోళనలో వైసీపీ ఎంపీలు..
సీఎం జగన్
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పాలన పట్ల జాతీయ స్థాయి మీడియాలో వ్యతిరేక కథనాలు, చర్చ జరుగుతోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై మీడియా పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన నిర్ణయాన్ని తప్పుపడుతూ పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అందుకే పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను మరోసారి రంగంలోకి దించారు సీఎం. దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు పీకేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే విషయాన్ని తాజాగా.. వైసీపీ ఎంపీలు ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో భాగంగా ఎంపీలు ఈ విషయాన్ని ఆయనకు తెలిపారు. జాతీయ స్థాయిలో సీఎం పాలనపై వ్యతిరేకత వస్తోందని చెప్పగా, అయితే.. ప్రభుత్వ విధానాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎంపీలకు ఆయన సూచించారు. ప్రభుత్వ విధానాలను అందరికీ వివరించాలని చెప్పారు. అటు.. జిల్లాల్లో ఎమ్మెల్యేలు తమను లెక్క చేయడం లేదని కూడా విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఎమ్మెల్యేల తీరును సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రోటోకాల్ పాటించి తమకూ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం ఇచ్చేలా చూడాలని కోరినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. రాజదాని అమరావతిలో జగన్ సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టును రద్దు చేయడంపై ప్రముఖ దినపత్రిక ఎకనామిక్స్ టైమ్‌లో ఓ ఎడిటోరియల్ రాసింది. అందులో ఏపీలో జగన్‌వి ‘తిరోగమన రాజకీయాలు’ అంటూ ఓ కథనం రాసింది.అందులో స్టార్టప్ ప్రాజెక్టు రద్దు విషయాన్ని కూడా ప్రస్తావించింది. అందుకే.. వైసీపీకి, తనకు ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉండేందుకు సీఎం జగన్‌.. ఐక్యాప్ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. ఇకనుంచి జగన్ ప్రభుత్వానికి సబంధించిన వ్యవహరాలన్నీ ప్రశాంత్ కీశోర్ టీమ్ చూస్తుందని సమాచారం.
First published: November 19, 2019, 5:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading