హోమ్ /వార్తలు /National రాజకీయం /

మరోసారి సారీ చెప్పిన విజయసాయి రెడ్డి.. కేంద్రమంత్రి చీవాట్లతో వెనక్కు తగ్గిన ఎంపీ

మరోసారి సారీ చెప్పిన విజయసాయి రెడ్డి.. కేంద్రమంత్రి చీవాట్లతో వెనక్కు తగ్గిన ఎంపీ

MP vijayasai Reddy

MP vijayasai Reddy

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ఎంపీ విజయసాయి రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్నారు. అయితే పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ వార్నింగ్ తో విజయసాయి రెడ్డి వెనక్కు తగ్గారని ప్రచారం జరుగుతోంది. అయితే వెంకయ్యనాయుడుకు విజయసాయి రెడ్డి క్షమాపణలు చెప్పడం ఇదే తొలి సారి కాదు.

ఇంకా చదవండి ...

  వైసీపీ కీలక నేత.. ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి క్షమాపనలు  చెప్పారు.. అవేశంలో అనుచితంగా మాట్లాడు అని ఒప్పుకున్నారు.. సోమవారం వెంకయ్యపై ఆవేశంగా విరుచుకుపడ్డ ఆయన 24 గంటలు దాటకముందే వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.. ఇలా సారీ చెప్పడం విజయసాయిరెడ్డికి ఇదే తొలిసారి కాదు.

  టీడీపీ నేతలపై ఎప్పుడూ విరుచుకుపడడంలో ముందు ఉండే విజయసాయిరెడ్డి..  రాజ్యసభ వేదికగా వెంకయ్యనాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. మొదట  సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలని విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తారు. ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. వెంటనే వైసీపీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో చైర్మన్ పై విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయి అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  దీనిపై స్పందించిన వెంక్యయ్యనాయుడు తాను ప్రస్తుతం ఏ పార్టీకి చెందినవాడిని కాదని వివరణ ఇచ్చారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అంతా తప్పుపట్టారు. అయితే, వెంకయ్య నాయుడు మాత్రం ఆ  ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు.

  విజసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను ప్రకంపణలు రేపడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ విజయసాయి రెడ్డిని మందలించినట్టు తెలుస్తోంది.  చట్టసభలో.. ఉన్నతమైన పదవిలో ఉన్నవారిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని.. వెంటనే వెంకయ్యనాయుడికి క్షమాపణలు చెప్పాలని ప్రహ్లాద్ జోషి హెచ్చరించినట్టు సమాచారం. దీంతో విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి క్షమాపణలు చెప్పారు.

  తాను రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదని వివరణ ఇచ్చారు. ఆవేశంలో కొన్ని మాట్లాడావల్సి వచ్చిందని వెంటనే తన వ్యాఖ్యలను బేషరుతుగా ఉపసంహరించుకుంటున్నా అన్నారు విజయసాయి రెడ్డి. తాను చేసిన వ్యాఖ్యలపట్ల తీవ్రంగా చింతుస్తున్నాను అన్నారు. భవిష్యత్తులో ఇలా మరోసారి జరగకుండా చూసుకుంటాను అంటూ విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు.

  అయితే విజయసాయి రెడ్డి వెంకయ్యనాయుడకు క్షమాపణలు చెప్పడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ రాజ్యసభ చైర్మన్ పట్ల  అనుచిత వ్యాఖ్యలు చేశారు విజయ సాయి రెడ్డి. ఏపీ విభజన చట్టంపై అప్పట్లో రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా జరిగిన ఘటనపై ఆయన చైర్మన్‌కు క్షమాపణ చెప్పారు. అలా జరిగి ఉండాల్సింది కాదని.. జరిగిన దానికి చింతిస్తున్నట్టు వివరణ ఇచ్చారు.. ఇప్పుడు మరోసారి వెంకయ్యనాయుడుకి విజయసాయి రెడ్డి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.  అయితే  టీడీపీ, బీజేపీ ఎంపీలు మాత్రం విజయసాయి సారీ చెప్పినా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  అనాల్సినదంతా అనేసి ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా అంటూ మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి పరిస్థితి రాదంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Venkaiah Naidu, Vijayasai reddy

  ఉత్తమ కథలు