• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YCP MP VIJAYSAI REDDY PADAYATRA IN VIZAG AGAINST STEEL PLAN PRIVATIZATION NGS

Andhra Pradesh: వైఎస్ ఫ్యామిలీ తర్వాత ఆ పని చేస్తున్న మొదటి వ్యక్తి విజయసాయిరెడ్డే

Andhra Pradesh: వైఎస్ ఫ్యామిలీ తర్వాత ఆ పని చేస్తున్న మొదటి వ్యక్తి విజయసాయిరెడ్డే

ఏపీలో పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే వైఎస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి మొదట దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, తరువాత జగనన్న వదిలిన బాణంగా షర్మిల, ప్రతిపక్ష నేతగా జగన్ ఇలా ముగ్గురూ పాదయాత్రలతోనే ప్రజాధారణ పొందారు. ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి వారి బాటలోనే నడిచారు.

ఏపీలో పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే వైఎస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి మొదట దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, తరువాత జగనన్న వదిలిన బాణంగా షర్మిల, ప్రతిపక్ష నేతగా జగన్ ఇలా ముగ్గురూ పాదయాత్రలతోనే ప్రజాధారణ పొందారు. ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి వారి బాటలోనే నడిచారు.

  • Share this:
    వైసీపీ అధినేత జగన్ తరువాత.. ఆ పార్టీ కార్యక్రమాలను చూసుకునేది ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రమే.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వ్యవహరాలతో పాటు.. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసేది కూడా ఆయనే. పార్టీ పరంగా జగన్ నెంబర్ వన్ అయితే.. విజయసాయి నెంబర్ 2.. ఈ విషయం పార్టీ కార్యకర్తలు, కేడర్ అందరికీ తెలుసు.. నేరుగా జగన్ ను కలిసే అవకాశం లేని వారు విజయసాయికి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు.  వైఎస్ ఫ్యామలీ అంతే అమిత అభిమానం చూపించే విజయసాయి రెడ్డి జగన్.. ఇప్పుడు వైఎస్ ఫ్యామీలీ బాటలోనే నడిచారు.

    సాధరణంగా పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే వైఎస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి మొదట దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, తరువాత జగనన్న వదిలిన బాణంగా షర్మిల, ప్రతిపక్ష నేతగా జగన్ ఇలా ముగ్గురూ పాదయాత్రలతోనే ప్రజాధారణ పొందారు.

    మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 2003  ఏప్రిల్ 9వ తేదీన చేవెళ్లలో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. 68 రోజుల పాటు 1470 కిలో మీటర్ల మేర నడిచారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్రకు ముగింపు పలికారు. ఆ తరువాత జరిగిన 2004 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

    2012లో వైఎస్ కుమార్తె షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 18 ఇడుపుల పాయ నుండి ప్రారంభమైన ఆమె యాత్ర  4ఆగస్టు 2013న ఇచ్చాపురంలో ముగిసింది. మొత్తం 230 రోజుల పాటు 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల్లో, 3112 కిలోమీటర్ల మేర సాగింది. ఏపీలో వైసీపీ పూర్తిగా బలపడడానికి ఆమె పాదయాత్ర తోడైంది.

    వారిద్దరి తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అప్పటి ప్రతిపక్ష నేతగా 2017 నవంబర్ 6న ఇడుపుల పాయ నుంచి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. 341 రోజుల పాటు 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దూరంతో సమానం.9వ తేదీ జనవరి 2019న జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఈ పాదయాత్ర కారణంగా ఎవరూ ఊహించని విధంగా జగన్ నాయకత్వంలో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 175 ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జగన్.. 2003లో పాదయాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం చేస్తే.. 2017 పాదయాత్ర జగన్ ను సీఎంగా చేసింది. అందుకే ఏపీలో పాదయాత్రలు అంటే ఆ కుటుంబం మాత్రమే అనే  ముద్రపడింది. ఇప్పుడు వారి బాటలో నడిచారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు ఉద్యమం ఎగసిపడుతోంది. కేంద్రం తమ ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలంటూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి.. ఇప్పటికే కార్మిక, ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలో భాగమవుతున్నాయి. స్వయంగా సీఎం జగన్ సైతం కార్మిక సంఘాలను కలిసి స్టీల్ ఉత్పత్తికి విఘాతం కలగకుండా ఆందోళనలు చేయాలని చెప్పారు. ఇప్పుడు పార్టీ ఎంపీ.. రాజ్యసభ్యుడు విజయసాయి రెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాద యాత్ర చేపట్టారు. ఇలా ప్రజా సమస్యలపై.. ఒక దీక్ష తీసుకుని వైఎస్ కుటుంబం తరువాత.. ఆ పార్టీకి చెందిన మరో వ్యక్తి పాదయాత్ర చేపట్టడం ఇదే తొలిసారి. 2018లో నగరిలో రోజా పాదయాత్ర చేపట్టినా ప్రజా సమస్యలపై కాకుండా వైఎస్ జగన్ సంక్పల్ప యాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆమె పాదయాత్ర చేశారు. తరువాత గాలేరు-నగిరి సాధన కోసం ఆమె పాదయాత్ర చేసినా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమతమైంది. విజయసాయి రెడ్డి చేపట్టిన పాదయాత్రలో రోజా కూడా పాల్గొన్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు