చంద్రబాబును ఇమ్రాన్ ఖాన్‌తో పోల్చిన వైసీపీ... ఘాటుగా విమర్శలు

చంద్రబాబును పాక్ ప్రధానితో పోల్చుతూ మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు నాయుడు వార్నింగులు ఒకేలా ఉంటున్నాయని ఎద్దేవా చేేశారు.

news18-telugu
Updated: September 3, 2019, 11:09 AM IST
చంద్రబాబును ఇమ్రాన్ ఖాన్‌తో పోల్చిన వైసీపీ... ఘాటుగా విమర్శలు
చంద్రబాబు, ఇమ్రాన్ ఖాన్
  • Share this:
ఏపీ మాజీ ముుఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పోల్చింది వైసీపీ పార్టీ. ఆ పార్టీ రాజ్యసబ ఎంపీ విజయసాయిరెడ్డి... చంద్రబాబును పాక్ ప్రధానితో పోల్చుతూ మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు నాయుడు వార్నింగులు ఒకేలా ఉంటున్నాయని ఎద్దేవా చేేశారు. మూడునెలల్లోనే జగన్ ప్రభుత్వం అన్నింటిలో విఫలమైందనంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. అర్జంటుగా జగన్ సీఎం కర్చీ ఖాళీ చేయాలని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.


అంతకుముందు చంద్రబాబుతో పాటు.. పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ విజయసాయిరెడ్టి ఓ ట్వీట్ చేశారు. తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదని చంద్రబాబు చెబుతుంటే, కాలం కలిసిరావడం వల్ల, ఈవీఎంల వల్లే వైసీపీ గెలిచిందని ఆయన పార్టనర్ అంటున్నాడని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ... చంద్రబాబును విమర్శిస్తూ.... ట్వీట్ల దాడికి దిగారు. ఇధ్దరిపై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యాలు చేశారు. 23 సీట్లలో టీడీపీని, జనసేనను ఓ చోట ఎవరు గెలిపించారని సాయిరెడ్డి ప్రశ్నించారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 3, 2019, 11:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading