‘చెప్పండయ్యా ఎవరన్నా’ పవన్ కల్యాణ్‌పై వైసీపీ సెటైర్స్

ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుంది అంటూ పవన్ కల్యాణ్‌ను ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: September 15, 2019, 12:57 PM IST
‘చెప్పండయ్యా ఎవరన్నా’ పవన్ కల్యాణ్‌పై వైసీపీ సెటైర్స్
పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో
news18-telugu
Updated: September 15, 2019, 12:57 PM IST
జగన్ వంద రోజుల పాలనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ వైసీపీ కౌంటర్లు వేస్తోంది. శనివారం జగన్ వంద రోజుల పాలనపై మట్టాడిన పవన్ ఇసుక పాలసీపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడునెలలు గడిచినా ఇసుకపై సరైన విధానం తీసుకురాలేకపోయారన్నారు. ఇసుక అందక అనేకమంది భవన నిర్మాణ కార్యక్రమాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇసుక విధానంపై ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందన్నారు. రాష్ట్రంలో ఇసుకే లేకుండా చేశారన్నారు. వందరోజుల్లో ఇసుక పాలసీని తీసుకురాలేకపోయారంటూ మండిపడ్డారు పవన్.

పవన్ ఇసుక విధానంపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఇసుక విధానం మీద ఏదైనా అనాలంటే అలా కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని చెప్పండయ్యా ఎవరన్నా.ఇసుకును కిలో, పది కిలోల ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని కూడా తెలియపర్చండి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుంది’ అంటూ పవన్‌పైనే ట్విట్టర్‌లో సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...