మాలోకానికి పెళ్లి అవలేదా? నారా లోకేష్‌పై మళ్లీ సెటైర్లు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్‌లను విమర్శిస్తూ మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: September 7, 2019, 11:10 AM IST
మాలోకానికి పెళ్లి అవలేదా? నారా లోకేష్‌పై మళ్లీ సెటైర్లు
నారా లోకేశ్(File)
  • Share this:
ఏపీ మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శల ఘాటు పెంచింది. రోజుకొకసారి అయినా నారా లోకేష్‌ను విమర్శిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. తాజాగా  వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్‌లను విమర్శిస్తూ మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నెలకు రూ.5 వేల వేతనం అందుకునే గ్రామ వాలంటీర్లకు వివాహానికి పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎక్కసెక్కాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాయిరెడ్డి.

‘అప్రయోజకుడు, అజ్ఞాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా?’ అని  నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లు సైనికులకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని  సాయిరెడ్డి ప్రశ్నించారు. తన ట్విట్టర్ ‌ఖాతాలో చంద్రబాబు, నారా లోకేష్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి ఇలా వ్యక్తిగతంగా నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.


First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading