Home /News /politics /

YCP MP VIJAYASAI REDDY HOT COMMENTS ON EX MINSTER ASHOK GAJAPATHI RAJU AND HIS FAMILY HISTORY NGS VZM

Andhra Pradesh: వంశ చరిత్రను తిరగతోడిన ఎంపీ.. అశోక్ గజపతి రాజుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

అయితే ఈ విషయంలో జగన్ సర్కార్ మరోసారి దూకుడు పెంచడానికి సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

అయితే ఈ విషయంలో జగన్ సర్కార్ మరోసారి దూకుడు పెంచడానికి సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

ఏపీ రాజకీయాల్లో ట్వీట్ వార్ దుమారం రేపుతోంది. మొన్నటి వరకు అశోక్ గజపతి రాజుపై వరుస ట్వీట్లు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు నేరుగా.. అశోక్ గజపతి రాజు కుటుంబ చరిత్ర ఇదీ అంటూ ట్వీట్ల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది.

  ఏపీలో అశోక్ గజపతి రాజు-ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్లకు అశోక్ గజపతి రాజు సైలెంట్ కౌంటర్లు వేస్తున్నారు. విజయసాయి రెడ్డి మాత్రం దూకుడు పెంచారు. తాజాగా అతడు చేసిన వరుస ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిన్నటి వరకు కేవలం అశోక్ గజపతి రాజును మాత్రమే విమర్శించిన విజయసారెడ్డి.. నేరుగా ఈ రోజు గజపతుల కుటుంబాన్నే టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక అని.. ఫ్రెంచ్, బ్రిటీష్ సేనలను, పొరుగు రాజ్యం కుట్రలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. విజయరామ గజపతిలా వారు విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదంటూ అశోక్‌ గజపతి రాజు ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరుసుగా ఒకదాని వెంట ఒకటి ట్వీట్లు చూస్తూ ఎదురు దాడికి దిగారు విజయసాయి రెడ్డి..

  విజయ రామ గజపతి.. హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచం ఇచ్చి బొబ్బిలి కోట పై దొంగదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఒక ఫోటో క్లిప్‌ను ట్విట్టర్‌లో జత చేశారు విజయసాయి రెడ్డి. తండ్రి పీవీజీ రాజులా కాకుండా విజయరామ గజపతిలా మారి అశోక్ గజపతి.. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇది 18వ శతాబ్దం కాదని, మీ ఆటలు ఇక సాగవు అంటూ అశోక గజపతిరాజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గజపతులంటే ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడని మోతుబరి జమిందారులు అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.http://  గోల్కొండ సుల్తానులకు, నిజాం నవాబులకు బానిసలని ఫైర్ అయ్యారు. ఫ్రెంచ్ సైన్యాధిపతి బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బతీశారని అన్నారు. అలాంటి గజపతులు ప్రజలను పీడించి, బ్రిటీష్ వారికి కప్పం కట్టేవారంటూ ఫైర్ అయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిషర్లతో కలిసి ప్రజలను గజపతులు హింసించారని తీవ్రమైన కామెంట్స్ చేశారు.  http://  పీవీజీ, ఆనంద గజపతిని కాదని పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నావా అశోక్? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘కప్పం చంద్రబాబుకు కడుతున్నవా? పప్పు నాయుడికి కడుతున్నవా? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడవడంలో మీ పూర్వీకులే మీకు స్ఫూర్తా?’ అని ట్విట్టర్ వేదికగా పరుష వ్యాఖ్యలతో ఫైర్ అయ్యారు విజయాసాయి రెడ్డి. http://  అక్కడితోనే విజయసాయి రెడ్డి ఆగిపోలేదు. ఆవేశంతో విరామం లేకుండా వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఏ బై లా, ఫ్యామిలీ లా అయినా చట్టానికి లోబడి ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. రెండింటి మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటవుతుందన్నారు. http://  సతీ సహగమనం, వరకట్నం, బహు భార్యత్వం కుటుంబ ఆచారమంటే చట్టం ఒప్పుకుంటుందా? స్త్రీలకు ఆస్తిహక్కివ్వడం మా సంస్కృతిలోను, పూసపాటి రాజ్యాంగంలోను లేదంటే చెల్లుతుందా అశోక్? అంటూ ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశారు. http://  ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి ఖతం చేసాడు అశోక్ గజపతి. అందుకే ఎన్టీఆర్ పార్టీ నుంచి గెంటేసిన వారిలో మొదటిపేరు బాబుదైతే, రెండోది అశోక్ దే అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు.http://

  ప్రస్తుతం అశోక్ గజపతి రాజుపై విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. అయితే విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తెత్తున్నాయి. చాలామంది నెటిజన్లు అశోక్ గజపతిపై మాట్లాడే అర్హత విజయసాయికి రెడ్డికి లేదంటే కౌంటర్ ఇచ్చారు. అలాగే ఇది గజపతి కుటుంబానికి.. మీకు తేడా అంటూ పెట్టిన పోస్టు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది..  http://

   

  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ ట్వీట్ వార్ పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా అశోక్ గజపతి రాజును విజయసాయిరెడ్డి ఎందుకింతలా టార్గెట్ చేశారంటూ ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. నెటిజన్లు సైతం విజయసాయి రెడ్డి ట్వీట్లు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Tdp, Vijayasai reddy, Vizianagaram, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు