YCP MP VIJAYASAI REDDY GAVE CLARITY ON JOINING OF TDP MLA GANTA SRINIVASA RAO NGS
Municipal elections: వైసీపీలోకి గంటా? ముహూర్తం ఫిక్స్! రహస్యం బయటపెట్టిన విజయసాయిరెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? ఇప్పటికే ఆయన అధిష్టానం ముందు కొన్ని ప్రతిపాధనలు పెట్టారా? వాటికి ఆమోదం లభించినట్టేనా..? మున్సిపల్ ఎన్నికల లోపే టీడీపీకి బిగ్ షాక్ తప్పదా?
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? ఇప్పటికే ఆయన అధిష్టానం ముందు కొన్ని ప్రతిపాధనలు పెట్టారా? వాటికి ఆమోదం లభించినట్టేనా..? మున్సిపల్ ఎన్నికల లోపే టీడీపీకి బిగ్ షాక్ తప్పదా?
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. విశాఖలో రాజకీయాలను అంతా తానై చూసుకుంటున్నారు పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. విశాఖ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా సీఎం జగన్ ప్రకటించారు. ఆ దిశగా వేగంగా అడుగులు కూడా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి విశాఖలో విజయం వైసీపీకి తప్పనిసరైంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడితే.. విపక్షాలకు ఆయుధం దొరికినట్టే అవుతుంది. వైసీపీ నిర్ణయాన్ని విశాఖ ప్రజలు స్వాగతించడం లేదని విపక్షాలు విమర్శించడం పక్కా..
విపక్షాల విమర్శలకు చెక్ చెప్పాలి అంటే విశాఖలో ఎలాగైనా విజయం సాధించాల్సిందే. కానీ విశాఖలో వైసీపీకి అన్ని ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ఆశిస్తే కింద స్థాయిలో ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించ లేదు. దానికి తోడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగితే.. విశాఖ నగరంలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ జెండానే ఎగిరింది. ఆ తరువాత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీకి జై కొట్టినా.. కేడర్ మాత్రం చెక్కు చెదరలేదు.. ఆయన వెంట వచ్చిన వారు కూడా తిరిగి టీడీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది.
ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీకి షాక్ ఇవ్వాలి అనుకుంది వైసీపీ. టీడీపీ తరుపున ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్లను ఎక్కువ సంఖ్యలో చేర్చుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ అలర్ట్ అయ్యింది. స్వయాన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖ చేరుకుని నామినేషన్ వేసిన అభ్యర్థులు.. వైసీపీని కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు అడ్డుకట్ట పడినట్టే.
స్థానికంగా టీడీపీ కాస్త బలంగా ఉండడానికి తోడు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతికూలాంగా మారింది. ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని అధికార పార్టీ భావిస్తోంది. అది ముందే గుర్తించిన ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపట్టారు. దానికి తోడు సీఎం జగన్ స్వయంగా విశాఖ వచ్చి కార్మిక సంఘాలతో మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కార్మిక సంఘాలు.. ఉద్యమ కారులు ఆ మాటలనను నమ్మేలా లేరని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే స్టీల్ ప్లాంట్ వ్యవహారం జరిగిందని కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలను ఫేస్ చేయడం వైసీపీ అంత సులభం కాదు.
ముఖ్యంగా గాజువాక ప్రాంతం ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపించనున్నారు. ఆ పరిధిలోనే స్టీల్ ప్లాంట్ ఉండడంతో వైసీపీకి టెన్షన్ తప్పడం లేదు. ఇలాంటి సమయంలో గ్రేటర్ ఎన్నికలను ఫేస్ చేసి విజయం సాధించాలంటే గంటాలాంటి బలమైన నేత పార్టీకి అవసరమని వైసీపీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ ను టీడీపీలోకి ఆహ్వానించారు. అయితే ఇదంతా గంటాకు తెలిసే జరుగుతోందని ప్రచారం ఉంది. ముందు తన అనుచురుడిని వైసీపీలోకి పంపి.. దీంతో వచ్చే రియాక్షన్ చూశాక ఆయన పార్టీ మారే అవాకాశం ఉందంటున్నారు.. అది మున్సిపల్ ఎన్నికల ముందే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే వైసీపీ అధిష్టానంలో కీలక నేతలతో మాట్లాడినట్టు సమాచారం..
గంటా రాక కన్ఫాఫ్ అవ్వడంతోనే విజయసారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని బలోపేతం చేసుకొని జీవిఎంసి ఎన్నికల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమన్న విజయసారెడ్డి.. గతంలోనే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు కొన్ని ప్రతిపాధనలు పెట్టారని.. వాటికి అధినేత జగన్ స్పష్టత ఇచ్చాక.. గంటా వైసీపీలో చేరుతారని రహస్యం బయటపెట్టారు. సో విజయసాయి రెడ్డి వివరణ చూస్తే.. త్వరలోనే గంటా వైసీపీలో చేరడం ఖాయమైనట్టే చెప్పొచ్చు.. అయితే వైసీపీలో చేరిన కాశీ విశ్వనాథ్ మాత్రం.. తాను టీడీపీలో చాలా ఇబ్బందులు పడ్డాను అన్నారు. పలు పదవులు ఆశ చూపి, ఆఖరికి అన్యాయం చేశారు. గడిచిన రెండు సంవత్సరాలుగా రాజకియాలకు దూరంగా ఉన్నాను అని వివరణ ఇచ్చారు.