చంద్రబాబు గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోంది.. విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రం..

చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడని చురక అంటించారు.

news18-telugu
Updated: May 5, 2020, 1:23 PM IST
చంద్రబాబు గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోంది.. విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రం..
విజయసాయిరెడ్డి, చంద్రబాబు
  • Share this:
ఏపీలో మద్య నిషేధం దిశగా జగన్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే లిక్కర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే, లిక్కర్ ధరల పెంపును టీడీపీ ఖండించింది. ఈ పెంపుతో నాటు సారా వినియోగం పెరుగుతుందని, సామాన్యుడిపై పెంపు భారం పడుతుందని వాదిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు ఏపీలోని గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో తెరిచారని, మద్యం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు.

అయితే, చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడని చురక అంటించారు. ఈ మేరకు వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. ‘గతంలో పది ఇళ్ళకో బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావు. జగన్ గారు వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారు. వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోంది. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోంది!’ అని ట్వీట్ చేశారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: May 5, 2020, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading