Home /News /politics /

YCP MP VIJAYASAI REDDY COUNTER TO AP MINISTER NARA LOKESH AK

శవాలు ఎవరు లోకేశ్ ?.. వైసీపీ ఎంపీ విజయసాయి కౌంటర్

నారా లోకేశ్ (File)

నారా లోకేశ్ (File)

గుంటూరు జిల్లాలో చనిపోయిన రైతు కోటయ్య వ్యవహారాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని ట్విట్టర్‌లో విమర్శించిన లోకేశ్... ఆ పార్టీ శవాలపై పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దీనికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి... చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో చనిపోయిన రైతు కోటయ్య వ్యవహారాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని ట్విట్టర్‌లో విమర్శించిన లోకేశ్... ఆ పార్టీ శవాలపై పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... లోకేశ్‌కు కౌంటర్ ఇచ్చారు.



    తాము శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని లోకేశ్ అన్నారని... ఇంతకీ ఆ శవం ఎవరని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఆ శవం నువ్వా ? మీ నాన్న చంద్రబాబు అని సెటైర్లు వేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి హెలీకాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించడం వల్లే ఓ రైతు చనిపోయాడని ఆరోపించిన విజయసాయిరెడ్డి... పేదల ప్రాణాలంటే వారికి విలువ లేదని విమర్శించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Nara Lokesh, Tdp, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు