మంగళగిరి అవమానం మరిచిపోయారా... నారా లోకేష్‌పై విమర్శలు

మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: August 13, 2019, 10:22 AM IST
మంగళగిరి అవమానం మరిచిపోయారా... నారా లోకేష్‌పై విమర్శలు
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్‌పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ‘మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు. మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి పోతే ఎలా? అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.


గతకొన్నిరోజులుగా మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీపై విమర్శల దాడి చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు, మంత్రులు, ప్రభుతంపై ఆరోపణలు చేస్టు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. వైసీపీ సర్కార్‌కు సంబంధించిన ప్రతీ అంశంపై ఆయన తనదైనశైలిలో ట్వీట్లు చేస్తున్నారు. వాలంటీర్ల నియామకంలో కులం, మతం చూడలేదు వైకాపా కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూసాం అని స్వయంగా ప్రకటిస్తున్నారు అంటూ పోస్టులు పెట్టారు లోకేష్. అంతేకాదు... జగన్ పై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఏది ఏమైనా జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇదే ఎమ్మెల్యే, చంద్రబాబుగారిని అసెంబ్లీలో 'ఖబడ్దార్' అని అన్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్విన జగన్ గారు ఇప్పుడా నవ్వు ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలీక అవస్థలు పడుతుంటే మాకూ బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం... వైసీపీ సంస్కృతి అలాంటిది అంటే నారా లోకేష్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. దీంతో ఎలా అయిన ట్విట్టర్‌లో నారా లోకేష్‌‌ దూకుడుకు కళ్లెం వేయాలంటూ.. విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.


ఏది ఏమైనా జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇదే ఎమ్మెల్యే, చంద్రబాబుగారిని అసెంబ్లీలో 'ఖబడ్దార్' అని అన్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్విన జగన్ గారు ఇప్పుడా నవ్వు ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలీక అవస్థలు పడుతుంటే మాకూ బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం... వైసీపీ సంస్కృతి అలాంటిది.
First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు