హోమ్ /వార్తలు /రాజకీయం /

Ramateerdham Incident: సై అంటే సై.. రామతీర్థంపై ముదిరిన పొలిటికల్ వార్.. లోకేష్ కు విజయసాయి సవాల్

Ramateerdham Incident: సై అంటే సై.. రామతీర్థంపై ముదిరిన పొలిటికల్ వార్.. లోకేష్ కు విజయసాయి సవాల్

విజయసాయి రెడ్డి, నాారా లోకేష్ (ఫైల్)

విజయసాయి రెడ్డి, నాారా లోకేష్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని విజయనగరం జిల్లా (Vizianagaram District) రామతీర్థంలో జరిగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) మరోసారి స్పందించారు. ఆలయంపై దాడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) పనేనని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...

  రామతీర్థం ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. ఆలయంపై దాడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పనేనని స్పష్టం చేశారు. అంతేకాదు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విసిరిన ఛాలెంజ్ ను విజయసాయి రెడ్డి స్వీకరించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో చర్చకు సిద్ధమన ప్రకటించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామాలయాన్ని పరిశీలించిన విజయసాయి రెడ్డి.., కొండ కిందకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రామాలయంపై దాడి దురదృష్టకరమని.. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపంచారు.

  తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్న ఆయన.. చంద్రబాబు, ఆయన పార్టీ అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనడంలో సందేహం లేదన్నారు. ఇక నారా లోకేష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు. మీరు అడిగినట్లు సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. డేట్, టైమ్ మీరు చెప్తే చర్చకు వస్తానన్నారు. రామతీర్థం ఆలయానికి ఇప్పటికీ టీడీపీ నేత అశోక్ గజపతిరాజే ఉన్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనని విజయసాయి రెడ్డి ఆరోపించారు. విజయవాడలో ఆలాలు కూలగొట్టింది, సదావర్తి భూములు అమ్ముకున్నది, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు.

  లోకేష్ కౌంటర్

  విజయసాయి రెడ్డి చేసిన ప్రతిసవాల్ కు నారా లోకేష్ స్పందించారు. నా సవాల్ కు స్పందించే దమ్ము, ధైర్యం సీఎం జగన్ కు లేదా అని ప్రశ్నించారు. నేను ప్రమాణం అంటే..,వైసీపీ చర్చ అంటూ తోకముడుస్తున్నారన్నారు. నాపై చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని తేలిపోయిందన్నారు. మరో సవాల్ చేస్తున్నా.. ఇప్పటికైనా సంహాద్రి అప్పన్న సమక్షంలో ప్రమాణం చేసేందుకు సీఎం జగన్ సిద్ధమా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

  మొత్తానికి దేవుడి గుడిలో జరిగిన దుర్ఘటన అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ మరింత తీవ్రరూపం దార్చింది. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Hindu Temples, Nara Lokesh, Tdp, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు