• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YCP MP VIJAY SAI REDDY ON VIZAG STEEL PLANT PRIVATIZATION NGS

Viskha Steel plant: అసలు పాపం అధికారులదే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై విజయసాయిరెడ్డి

Viskha Steel plant: అసలు పాపం అధికారులదే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై విజయసాయిరెడ్డి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త వాదన తెరపైకి తెచ్చారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉన్నతాధికారులు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఇలా జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త వాదన తెరపైకి తెచ్చారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉన్నతాధికారులు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఇలా జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు.

  • Share this:
    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం కేంద్రానిదని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.. టీడీపీ సహా విపక్షాలు మాత్రం అధికార వైసీపీదే తప్పు అంటున్నాయి.. అక్కడ విలువైన భూములను విక్రయించేందుకే ప్రైవేటీకరణ డ్రామాలు ఆడుతోందని మండిపడుతున్నారు. కానీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం కొత్త వాదన తెరపైకి తెచ్చారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉన్నతాధికారులు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఇలా జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు.

    ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ సిబ్బంది అంతా స్థానికులే ఉన్నారని.. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఇక్కడి వారు కాదని.. వారిలో ఎక్కువ మంది ఒడిశాకు చెందిన వారే ఉన్నారని.. అందుకే స్టీల్ ప్లాంట్ పై వారు కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్నత స్థాయిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉండడంతో వారికి మన రాష్ట్ర ప్రయోజనాలపై ఆసక్తి లేదన్నారు. అందుకే ప్లాంటు ఉన్నతాధికారులు కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

    స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్ర విజయవంతం అయింది. ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25  కిలోమీటర్ల  మేర ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర తరువాత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన రహదారిపై నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కేంద్రపై ఒక్క విమర్శకూడా చేసే ప్రయత్నం చేయలేదు. అయితే పోరాడి సాధించిన స్టీల్‌ ప్లాంట్‌ను వదులుకునేందుకు మాత్రం సిద్ధంగా లేమన్నారు.ఆ అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పోస్కో ప్రతినిధులకు సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు రావద్దని సంస్థ ప్రతినిధులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. కడప లేదా కృష్ణపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలని.. అందుకు కావాల్సిన భూమిని ప్రభుత్వం అందిస్తుందని సూచించనట్టు సీఎం స్పష్టం చేశారని వివరించారు.

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేవు. ప్రకాశం జిల్లాలో ఉన్నా అవి ప్రయోజనకరంగా లేవు. గనుల సమీకరణకు ఒడిశాకు 1500 కోట్లు ఇచ్చామని. ఇప్పటివరకు ఒడిశా నుంచి ఒక్క టన్ను గనుల సమీకరణ జరగలేదన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు 20 వేల కోట్ల భారం ఉందని. రుణాలకు దాదాపు 2,700 కోట్ల రూపాయాలు వడ్డీ కడుతున్నామన్నారు. ఈ రుణ భారంతోనే స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లోకి వెళ్లిందని.. కేంద్రం కల్పించుకుని రుణ భారాన్ని ఈక్విటీగా మారిస్తే లాభాల్లోకి వెళ్తుందని అశాభావం వ్యక్తం చేశారు. ఇవే అంశాలను వివరిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ కేంద్రం నుంచి కనీసం ఇప్పటి వరకు సమాధానం కూడా రాలేదని మాట అయినా ఆయన ప్రసంగంలో ఎక్కడా వినిపించలేదు.

    మరోవైపు రాష్ట్రంలో పార్టీలపై ఎప్పటిలాగే విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ద్రోహి అని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎప్పటికీ చంద్రబాబును క్షమించరన్నారు. ప్రజల ఆకాంక్షను వైఎస్సార్‌ సీపీ నెరవేరుస్తుందనే నమ్మకంతోనే.. పాదయాత్రను ప్రజలు విజయవంతం చేశారని అన్నారు. అయితే విజయసాయి రెడ్డి విమర్శలకు సమాధానం చెప్పాలనుకున్నారో.. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రాన్ని నిలదీయాలి అనుకున్నారో.. చంద్రబాబు మాత్రం స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు.

    ఇదీ చదవండి:  విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దు.. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

    ఎన్నో త్యాగాల ఫలమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నామన్నారు. అధికార పార్టీగా కార్మిక సంఘాలకు పూర్తి భరోసాగా ఉంటామన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల కోసం పోరాడుతాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు విజయసాయిరెడ్డి. అయితే విజయసాయి రెడ్డి ఎక్కడా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు