Home /News /politics /

YCP MP RAGHURAMA RAJU SERIOUS COMMENTS ON VIJAYSAIREDDY NGS

విజయసాయిరెడ్డికి జగన్ క్లాస్ పీకారా..? అందుకే వెంకయ్యనాయుడుకి క్షమాపణలు చెప్పారా..?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పడం వెనుక రీజన్ ఏంటి..? సీఎం జగన్ విజయసాయి రెడ్డిని మందలించారా..? క్షమాపణలు చెప్పాల్సిందిగా గట్టి డోస్ ఇచ్చారా..? ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు ఆ పార్టీ ఎంపీ రఘురామ రాజు.

    వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ క్లాస్ పీకారా..? అందుకే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోపే క్షమాపణలు చెప్పారా..? అవునని అంటున్నారు ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ రాజు.  అక్కడితోనే ఆగలేదు..  ఆయన్ను అలాగే వదిలిస్తే జాతీయ  స్థాయిలో పార్టీ పరువు పోతుందని అభిప్రాయపడ్డారు.

    తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై  ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం విజయసాయరెడ్డికి అలవాటే అనే.. కానీ ఎప్పుడూ ఆయన ఎవరికీ క్షమాపణలు చెప్పరని.. అలాంటింది వెంకయ్యనాయుడుకి క్షమాపణలు చెప్పారంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది అన్నారు.  సీఎం జగన్ మందలించి ఉండొచ్చని.. ఆయన డోసు గట్టిగా ఇచ్చి ఉంటారని అందుకే విజయసాయి రెడ్డి క్షమాపణలు చెప్పి ఉంటారని రఘురామ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. విజయసాయిరెడ్డికి కఠిన శిక్ష పడి ఉండేది అన్నారు.

    ఉపరాష్ట్రపతిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు కనీసం ఆరు నెలల శిక్ష పడి ఉండేదన్నారు రఘురామ. అందుకే సీఎం మందలించి.. క్షమాపణలు కోరాలని చెప్పినట్టున్నారు. సీఎంతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా విజయసాయిరెడ్డిని తీవ్రంగా మందలించినట్టు సమాచారం ఉందన్నారు. తమ జాతీయ కార్యదర్శి ఏదో మూడ్‌లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రఘురామ సెటైర్లు వేశారు.. అందుకే ఈ తప్పు మరోసారి చేయనన్నారని గుర్తు చేశారు.

    ఓవైపు ఉక్కు సంకల్పంతో నిమ్మగడ్డపై విజయసాయి విరుచుకుపడుతున్నారని. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి నిమ్మగడ్డ వెళ్లడంపై విజయసాయి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని. కంటి చూపే సరిగ్గా లేదా... బుర్ర సరిగ్గా లేదా... వెళ్లాల్సింది ఎల్వీ ప్రసాద్ కు కాదు.. ఎర్రగడ్డ ఆస్పత్రికి అంటూ విమర్శించిన విజయసాయికి 24 గంటల్లోనే తన బుర్ర సరిగ్గా లేదని భగవంతుడే చెప్పించాడని రఘరామ రాజు సెటైర్ వేశారు.

    ఈ మధ్య విజయసాయి రెడ్డి ఎక్కువగా వైజాగ్‌లోనే ఉంటున్నారని.  అక్కడి  హాస్పిటల్‌లో ఏదైనా మార్పులు వచ్చాయేమో అని.. అందుకే అలా కన్ఫ్యూజన్ లో ఉండి రాజ్యసభలో మాట్లాడి ఉంటారని రఘురామ కౌంటర్ ఇఛ్చారు. పార్లమెంటరీ వ్యవస్థనే వివస్త్రను చేస్తున్నట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇలా మాట్లాడితే వైసీపీ పరువు జాతీయస్థాయిలో పోతుందని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం జగన్ గుర్తుంచుకోవాలన్నారు.. ఇప్పటికైనా ఇలాంటి లీడర్ పై యాక్షన్ తీసుకుంటే మంచిదంటూ సూచించారు. మీ లీడర్ పై చర్యలు తీసుకోరా అంటూ తనకు అందరూ ఫోన్ లు చేస్తున్నారని వివరించారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: MP raghurama krishnam raju, Vijayasai reddy, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు