హోమ్ /వార్తలు /politics /

జాయింట్ కలెక్టర్ విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే

జాయింట్ కలెక్టర్ విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

వినాయక చవితి రోజు జరిగిన వివాదాన్ని కేంద్రంగా చేసుకొని నా కులం పై లేనిపోని ఆరోపణలు సృష్టించారని విమర్శించారు.తాను పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు శ్రీదేవి.

తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి తాడికొండ శ్రీదేవి గారు కలెక్టర్ కార్యాలయంలో జెసి దినేష్ కుమార్ గారి ముందు హాజరైనారు. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదంటూ దాఖలైన ఫిర్యాదులపై విచారన చేపట్టారు. ఈ మేరకు గతంలోనే నవంబర్ 26న విచారణకు హాజరుకావాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ .. ఎమ్మెల్యే శ్రీదేవికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ ధృవీకరణకు సంబంధించిన ఆన్ని ఆధారాలతో రావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే... మూడు తరాలకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.

శ్రీదేవి మట్లాడుతూ బీజేపీ నేతల ముసుగులో టీడీపీ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. తాను గతంలోనే చంద్రబాబునాయుడు సవాల్ విసిరాను ఆయన ఎందుకు నా సవాల్ కి స్పందించలేదన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ రాజధానిలో అక్రమాలు బయట పెడుతున్నానని తనను వేధింపులకు గురి చేసేందుకు కక్ష కట్టారన్నారు. వినాయక చవితి రోజు జరిగిన వివాదాన్ని కేంద్రంగా చేసుకొని నా కులం పై లేనిపోని ఆరోపణలు సృష్టించారని విమర్శించారు.తాను పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుల ధ్రువపత్రాలన్నీ జేసీ దినేశ్‌కుమార్‌కు అందించినట్లుగా తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. పరును నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, TDP, Vundavalli sridevi, Ysrcp

ఉత్తమ కథలు