శివప్రసాద్ నాకు గురువు... ఎమ్మెల్యే రోజా ట్వీట్

శివప్రసాద్ శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు

news18-telugu
Updated: September 22, 2019, 2:16 PM IST
శివప్రసాద్ నాకు గురువు... ఎమ్మెల్యే రోజా ట్వీట్
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే రోజా
  • Share this:
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా. తన తోటి నటులు అయిన శివప్రసాద్ తనకు గురువు సమానులు అన్నారు. ఆయన అనారోగ్యంతో మరణించడం బాధకరమని పేర్కొన్నారు రోజా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు రోజా.

శివప్రసాద్ శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లాకు చెందిన శివకుమార్‌ నాటకరంగం నుంచి వెండితెరకు వెళ్లారు. తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించారు. ఆ తర్వాత తనలోని ప్రతిభకు పదును పెట్టి నాలుగు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.

ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. మెగాఫోన్ పట్టిన మొదటి సినిమాలో రోజాను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేశారు. అంతకు ముందు శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమాలో రోజా నటించినా.. హీరోయిన్‌గా పరిచయం అయింది మాత్రం ప్రేమ తపస్సుతోనే. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పక్కన హీరోయిన్‌గా నటించింది. నారమల్లి శివప్రసాద్, ఆర్కే రోజా ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. మొదట శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. రోజా కూడా తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వైఎస్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు రోజా.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading