చంద్రబాబు చేతకాని దద్దమ్మ.. ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు..

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా విమర్శంచారు. చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: December 10, 2019, 4:48 PM IST
చంద్రబాబు చేతకాని దద్దమ్మ.. ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు..
రోజా, చంద్రబాబు నాయుడు(File)
  • Share this:
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా విమర్శంచారు. చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మెదడు చితికి పోయిందంటూ ఫైర్ అయ్యారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన రోజా.. చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన కుమారుడు విదేశాలకు వెళ్లి చదువుకున్నాడని గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రమా? దేశమా? అన్నది కూడా తెలీదని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు వర్ధంతికి, జయంతికి తేడా కూడా తెలీదని.. మంగళగిరిని మందలగిరి అని అన్నాడని, చంద్రబాబు మందబుద్ధి ఉన్న కొడుకును కన్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మహిళా భద్రత బిల్లు గురించి మాట్లాడుతుంటే.. ఉల్లిపాయల దండలు వేసుకొని వచ్చారని అంటూనే అచ్చెన్నాయుడిని ఎద్దేవా చేశారు.

అటు.. రైతులపై ప్రేమ ఉన్నట్లు టీడీపీ నేతలు నటిస్తున్నారని, ఆ సమస్యపై సభలో మాట్లాడాలని సమయం ఇస్తే బయట తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రగడ్డ నుంచి లొల్లి చేయడానికే అసెంబ్లీకి వచ్చారని అన్నారు. చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సొంత కుమారుడిని గెలిపించుకోని చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయారని అన్నారు.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>