చంద్రబాబు విజన్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు

చంద్రబాబు, టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. రైతులు ముసుగులు టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారన్నారని విమర్శలు చేశారు రోజా.

news18-telugu
Updated: January 20, 2020, 10:22 AM IST
చంద్రబాబు విజన్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు
చంద్రబాబు, రోజా
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా. చంద్రబాబు ప్రతిపక్ష నేత, పనికిమాలిన నాయకకుడా ? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ విమర్శలు చేశారు. చట్టసభల్ని అడ్డుకోవడమే చంద్రబాబు విజనా ? అలజడులు సృష్టించడమే చంద్రబాబు విజనా? అంటూ ప్రశ్నించారామె. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో భూములు దోచుకున్నారని రోజా ఆరోపణలు చేశారు. చంద్రబాబు, టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. రైతులు ముసుగులు టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమి లేదన్నారు రోజా. చంద్రబాబు విజన్ ఏంటో ఇప్పుడు తేటతెల్లమైందన్నారు.

 

 

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు