నగరిలో గ్రాండ్‌గా రోజా కూతురు అన్షు బర్త్‌డే సెలబ్రేషన్స్‌

ఈ వేడుకల్లో భర్త సెల్వమణి , కుమారుడు కృష్ణ లోహిత్ కూడా పాల్గొన్నారు. కుటుంబసభ్యులందరితో కలిసి కూతురు అన్షు పుట్టినరోజు వేడుకల్ని ఆమె నిర్వహించుకున్నారు

news18-telugu
Updated: September 10, 2019, 3:59 PM IST
నగరిలో గ్రాండ్‌గా రోజా కూతురు అన్షు బర్త్‌డే సెలబ్రేషన్స్‌
కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో రోజా
  • Share this:
ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా గత కొన్ని రోజులుగా కుటుంబంతో సరద సరదాగా గడుపుతున్నారు. తాజాగా మరో సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. నగరిలో తన నివాసంలో కూతురు అన్షుమాలిక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భర్త సెల్వమణి , కుమారుడు కృష్ణ లోహిత్ కూడా పాల్గొన్నారు. కుటుంబసభ్యులందరితో కలిసి కూతురు అన్షు పుట్టినరోజు వేడుకల్ని ఆమె నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గతవారం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోజా.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. అక్కడ కూడా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. వైసీపీ అభిమానులతో నిర్వహించిన , నాయకులు నిర్వహించిన కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న ఎన్నారైలు... రోజా దంపతుల్ని ఘనంగా సన్మానించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని నిన్నే ఇండియాకు తిరిగి వచ్చారు ఎమ్మెల్యే రోజా.
First published: September 10, 2019, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading