అసెంబ్లీలో సీఎం జగన్‌పై రోజా ప్రశంసలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాజన్న రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారన్నారు రోజా.

news18-telugu
Updated: July 29, 2019, 3:31 PM IST
అసెంబ్లీలో సీఎం జగన్‌పై రోజా ప్రశంసలు
ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్
news18-telugu
Updated: July 29, 2019, 3:31 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, పేదల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి అసెంబ్లీ ఇదేనని రోజా ప్రశంసించారు. గత ఐదేళ్లుగా అప్రాప్రియేషన్ బిల్లు పెట్టి పాస్ చేసుకోవడాన్ని చూశామని, కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్రాప్రియేషన్ బిల్లు విభిన్నమైందని అన్నారు. ఈ బిల్లు ద్వారా ప్రతి రూపాయి ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందని చెప్పారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాజన్న రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారన్నారు. ఇప్పుడు, సీఎం జగన్ యాభై రోజుల పాలన చూసిన తర్వాత రాజన్న రాజ్యం వచ్చిందన్నారు రోజా.  మాట మీద నిలబడే సీఎంను మొదటి సారి చూస్తున్నామని జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు రోజా.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...