ఆర్టీసీ ఛైర్ పర్సన్‌గా ఎమ్మెల్యే రోజా?... స్పష్టమైన హామీ లభించిందా..?

MLA Roja : మంత్రి పదవి దక్కని రోజా... అలక పాన్పు ఎక్కగా... ఆమెను ఓదార్చుతూ... కీలక పదవి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రోజాకి మరింత గుర్తింపు దక్కినట్లే.

Krishna Kumar N | news18-telugu
Updated: June 10, 2019, 12:13 PM IST
ఆర్టీసీ ఛైర్ పర్సన్‌గా ఎమ్మెల్యే రోజా?... స్పష్టమైన హామీ లభించిందా..?
ఎమ్మెల్యే రోజా (File)
  • Share this:
ఏపీ కేబినెట్ కూర్పులో సీఎం జగన్ ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నా... ఎమ్మెల్యే రోజాకి మంత్రిపదవి ఇవ్వకపోవడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. సొంత వర్గం నుంచే పోటీ ఎదుర్కొని మరీ గెలిచిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కరెక్టు కాదని పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐతే... స్పీకర్ పదవి వద్దన్న ఆమెకు... సామాజిక సమీకరణాల రీత్యా మంత్రి పదవి ఇవ్వలేకపోయారే తప్ప... సీఎం జగన్ ఆమెను పక్కన పెట్టలేదని అంటున్నారు ఆయన సన్నిహిత వర్గీయులు. ఈ క్రమంలో ఆర్టీసీ ఛైర్ పర్సన్‌గా రోజాను నియమించబోతున్నారే ప్రచారం తెరపైకి వచ్చింది. మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాకుండా... అలకపాన్పు ఎక్కిన రోజాతో మాట్లాడిన... పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి... ఆమెకు ఆర్టీసీ అధ్యక్షురాలి పదవి ఇవ్వబోతున్నట్లు చెప్పారనీ... దాంతో రోజా అలక వీడారనే వాదన వినిపిస్తోంది.

ఆర్టీసీ ఛైర్ పర్సన్ పదవి ఇవ్వకపోతే.... మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవైనా తనకు ఇవ్వాలని రోజా కోరినట్లు తెలుస్తోంది. రోజాపై ఇంతలా చర్చ జరుగుతుండటానికి కారణం... ఆమె ఎప్పటి నుంచో వైసీపీకి అండగా ఉంటూ... పార్టీలో దాదాపు సెకండ్ పొజిషన్‌లో కొనసాగడమే. 2009లో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచీ పోటీ చేసి ఓడిన రోజా... ఆ తర్వాత వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ మరణం తర్వాత... జగన్‌ వెంట ఉన్నారు. ఆ క్రమంలో చిత్తూరు జిల్లా నగరి నుంచీ వరుసగా రెండుసార్లు గెలిచారు. మంత్రి పదవి దక్కని ఆమెకు... నామినేటెడ్ పదవి కచ్చితంగా ఇవ్వాలనీ, లేదంటే అది వైసీపీకి ఇబ్బందికర పరిణామం అవుతుందంటున్నారు ఆమె వర్గీయులు.

నామినేటెడ్ పోస్టుల్లో ది బెస్ట్ ఏదంటే... టీడీపీ ఛైర్మన్ పదవే. ఆ తర్వాత చెప్పుకోతగ్గది ఆర్టీసీ ఛైర్మన్ పోస్టే. నిజానికి అదో ముళ్ల కిరీటం లాంటిది. ఎందుకంటే ఏపీఎస్ ఆర్టీసీ ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటోంది. కోట్ల మంది ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు అందర్నీ కలుపుకుంటూ వెళ్లాలి. ఎప్పటికప్పుడు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుల భారం తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఇలాంటి ఎన్నో సవాళ్లున్న పోస్ట్ అది. ఇప్పటికే రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతున్న రోజాకి ఆ పదవిని నిర్వహించడం పెద్ద కష్టం కాకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.

 ఇవి కూడా చదవండి :

ఏపీ పాలనలో సీఎం జగన్ మార్క్‌... చంద్రబాబు ఫేడవుట్...

బిచ్చం డబ్బులతో ఆలయాల అభివృద్ధి... ఓ ముసలాయన ఔదార్యం...ఆస్ట్రేలియా వరుడితో పెళ్లి... మధ్యలో ఎంటరైన యువకుడు... ఆ తర్వాత...

కేరళలో భారీ వర్షాలు... తుఫాను వచ్చే సంకేతాలు...

First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading