YCP MLA JAKKAMPUDI RAJA INSURES VILLAGE VOLUNTEERS IN RAJANAGARAM CONSTITUENCY OF ANDHRA PRADESH WITH HIS OWN MONEY SNR
గ్రామ సచివాలయం వాలంటీర్లకు ఫ్రీ ఇన్స్యూరెన్స్..ఆ ఎమ్మెల్యేకి వాళ్లపైన ఎందుకంత ప్రేమ
Photo Credit: Twitter
YCP MLA: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ వాలంటీర్లకు తన సొంత డబ్బుతో ఇన్స్యూరెన్స్లు చేయించారు. అంతే కాదు ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని..విపక్షాల విమర్శలు వినరని చెప్పారు. రాబోయేది కూడా వైసీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఫస్ట్(First wave), సెకండ్(Second wave)తో పాటు ప్రస్తుతం నెలకొన్న థర్డ్‌వేవ్ పరిస్థితుల్లో కూడా అన్నీ గ్రామాలు, మండలాలు, నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ వాలంటీర్లు సేవలందిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫథకాలను ప్రాధమిక స్థాయి నుంచి పరిశీలిస్తున్నారు. అలాంటి వాళ్లు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వంతుగా సాయం చేయాలని భావించారు తూర్పుగోదావరి జిల్లా (East godavari district)రాజానగరం ఎమ్మెల్యే (Rajanagaram mla)జక్కంపూడి రాజా (Jakkampudi Raja).తన నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి వాలంటీర్లకు తన సొంత ఖర్చులతో ఇన్స్యూరెన్స్ (Free insurance) చేయించారు. అంతే కాదు వారికి ఇన్స్యూరెన్స్ (Insures) పత్రాలను జిల్లా కలెక్టర్ (Collector) హరికిరణ్ (Hari kiran)చేతుల మీదుగా ఇప్పించారు. అభివృద్ధిలో రాజానగరం నియోజకవర్గం జిల్లాలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు ఎమ్మెల్యే రాజా. అలాగే ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90శాతం నెరవేర్చామన్నారు.రాష్ట్ర ప్రజలకు అవసరమయ్యే అత్యుత్తమ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశ పెడుతున్నారని చెప్పారు. జనంలో జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూడలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వాటిని ప్రజలు పట్టించుకోరని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని..ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకే పట్టం కడతారాని ఆశాభావం వ్యక్తం చేశారు.
వాలంటీర్లకు ఇన్స్యూరెన్స్లు..
రాష్ట్రంలో ప్రభుత్వమే జీతాలు ఇచ్చి ప్రజా సేవలో భాగస్వాములు కావాలని వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటారని ప్రత్యేకంగా నియామకాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అలాంటి ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వాళ్లకు ప్రజాప్రతినిధులు ఇలా సొంత ఖర్చులతో ఇన్స్యూరెన్స్ చేయించడం హర్షించదగిన పరిణామే అయినప్పటికి విపక్షాలు మాత్రం వీటిని స్వాగతించే పరిస్థితి లేదు.
Volunteers Insurance: సొంత ఖర్చుతో వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించిన ఎమ్మెల్యే రాజాhttps://t.co/XjChCxbWV8
విమర్శలు తలెత్తే అవకాశం ఉంది..
ప్రభుత్వం నియమించిన వాలంటీర్లకు ప్రజాప్రతినిధులు ఎందుకు ఇలా సొంత ఖర్చులతో ఇన్స్యూరెన్స్ చేయిస్తున్నారు. అదేదో ప్రభుత్వమే చేయించవచ్చు కదా అనే ప్రశ్నల్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంది. ఇలా ఎవరికి వాళ్లు సొంత నియోజకవర్గ పరిధిలోని గ్రామవాలంటీర్లకు ఇన్స్యూరెన్స్లు చేయిస్తే వాళ్లు ప్రజాసేవ, ప్రభుత్వ సేవకంటే ఎక్కువగా ప్రజాప్రతినిధుల చెప్పు చేతల్లో ఉంటారనే విమర్శలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.