చంద్రబాబు ఏమైనా శోభన్ బాబా?... వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న..

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖ కోసం ఒక్క చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏమైనా చేశారా అని గుడివాడ ప్రశ్నించారు.

news18-telugu
Updated: October 12, 2019, 5:17 PM IST
చంద్రబాబు ఏమైనా శోభన్ బాబా?... వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న..
నారా చంద్రబాబునాయుడు (File)
news18-telugu
Updated: October 12, 2019, 5:17 PM IST
చంద్రబాబుకు మతిపోయిందో.. లేకపోతే మత్తు ఎక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరిపాలనను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు తెలిసినంతలో చంద్రబాబుకు మందు అలవాటు లేదని, అధికారం పోయాక మందు అలవాటు వచ్చిందేమో తెలీదని అమర్‌నాథ్‌ అనుమానం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. లోకేశ్‌ భవిష్యత్‌ ముగిసిపోయిందనే బాధతో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని అమర్‌నాథ్ అన్నారు. విశాఖకు చంద్రబాబు ఏమి చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. విశాఖ మీద ఎన్నో కలలు కన్నానంటూ చంద్రబాబు కపట ప్రేమ నటిస్తున్నారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖ కోసం ఒక్క చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏమైనా చేశారా అని గుడివాడ ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు, బీహెచ్‌పీని ఎల్అండ్‌టీకి ఇచ్చేద్దాం.. చుట్టుప్రక్కల కొండల్ని గీతంకు ఎప్పుడు ఇచ్చేద్దామని చంద్రబాబు చూశారని అమర్నాధ్‌ మండిపడ్డారు.

విశాఖ పర్యటనలో చంద్రబాబునాయుడు


‘లక్షలాది మంది చంద్రబాబుకు స్వాగతం పలకటానికి వచ్చినట్లు ఫీలవుతున్నారు. జగన్‌తో ఫొటోలు దిగటానికి వస్తారు. మరి, చంద్రబాబును చూసి ఎందుకు రావాలి? మీకు అందం ఉందా? హీరోయిజం ఛరిష్మా ఉందా? అంతా... బ్యాక్‌ డోర్‌ పాలిటిక్సే. వెన్నుపోటు రాజకీయం. మేనేజ్‌మెంట్ రాజకీయం. మీరేమైనా శోభన్‌బాబులా ఉంటారా? మీరు ఇంట్లో వాళ్లకు ఏమైనా శోభన్‌బాబులా కనిపిస్తారేమో కానీ మాకు కాదు. కనీసం చెప్పే మాటల్లో అయినా, చేతల్లో అయినా అందం ఉండదు’ అని అమర్‌నాథ్ అన్నారు.

మీ పాలలో ప్లాస్టిక్ ఉందా.. ఈ పాలలో ఉంది జాగ్రత్త..First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...