నారా భువనేశ్వరిపై రోజా తీవ్ర వ్యాఖ్యలు..

భువనేశ్వరి, రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    ఏపీ రాజధాని గ్రామాల్లో నిన్న చంద్రబాబుతో కలిసి పర్యటించిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. అమరావతి ఉద్యమానికి తన వంతు విరాళం అందించారు. తన చేతికి ఉన్న బంగారు గాజును తీసి అక్కడున్న రైతులకు ఇచ్చారు. ఈ గాజును బహిరంగ వేలం వేసి, ఆ డబ్బును ఉద్యమానికి వినియోగించాలని రైతులకు తెలిపారు చంద్రబాబు. అయితే.. ఆమెపై అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా, ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్న తండ్రి ఎన్టీఆర్‌కే అన్నం పెట్టలేని భువనేశ్వరి.. తన గాజులు తాకట్టు పెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ సెటైర్ వేశారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్‌కు పట్టించుకోలేదని విమర్శించారు.

    అటు.. ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా భువనేశ్వరిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పప్పుబెల్లాల మాదిరిగా చవగ్గా కొట్టేసిన భూములు ఆమె తీవ్రంగా విమర్శించారు. భువనేశ్వరి కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి 14.22 ఎకరాల భూమిని చవక ధరకు కొట్టేశారని ఆరోపించారు. ఆ భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: