వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం... ఐదేళ్ల జీతం దానం...

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు అసెంబ్లీ నుంచి వచ్చే జీతం, భత్యం మొత్తం కనెక్ట్ టు ఆంధ్రాకు డొనేట్ చేశారు.

news18-telugu
Updated: November 8, 2019, 7:39 PM IST
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం... ఐదేళ్ల జీతం దానం...
అసెంబ్లీ కార్యదర్శికి తన అంగీకార లేఖ అందజేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి
news18-telugu
Updated: November 8, 2019, 7:39 PM IST
వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు ఏపీ అసెంబ్లీ నుంచి వచ్చే జీతం, భత్యం మొత్తం దానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ‘కనెక్ట్ టు ఆంధ్రా’ పేరుతో తీసుకొచ్చిన ఈ వెబ్‌సైట్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలకు సాయం చేయాలనుకునే కంపెనీలు, వ్యక్తులు, సంస్థలు, ఎన్ఆర్ఐలు ఈ వెబ్‌సైట్ ద్వారా డొనేట్ చేయొచ్చు. ‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు. మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం మీరు ఎంతోకొంత మంచిచేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’ అని జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

తన జీతం, భత్యం మొత్తం కనెక్ట్ టు ఆంధ్రాకు ఇచ్చేయాలని కోరుతూ ఆళ్ల ఆర్కే అందించిన లేఖ


సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేగా తనకు అసెంబ్లీ నుంచి వచ్చే జీతం, భత్యం మొత్తం కనెక్ట్ టు ఆంధ్రాకు డొనేట్ చేశారు. ఈ మేరకు తన అంగీకారపత్రాన్ని తెలియజేస్తూ ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చారు. మొత్తం ఐదేళ్ల కాలానికి సంబంధించి మొత్తాన్ని కనెక్ట్ టు ఆంధ్రా కు బదిలీ చేయాలని కోరారు. 2019 నవంబర్ నుంచి తన పదవీకాలం పూర్తయ్యే వరకు వచ్చే వేతనాలు కనెక్ట్ టు ఆంధ్రాకు ఇవ్వాలని కోరారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం మే 30 నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఐదు నెలలు పూర్తయ్యాయి. ఇంకా 55 నెలల పదవీకాలం ఉంది. ఏపీలో ఓ ఎమ్మెల్యేకు జీతం, భత్యం కలిపి నెలకు రూ.1.95లక్షల వరకు వస్తాయి. అంటే 55 నెలల కాలానికి వచ్చే జీతం, వేతనాలను పరిశీలిస్తే ఆయనకు సుమారు రూ.కోటి వరకు వస్తాయి.

First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...