YCP MLA ALLA RAMAKRISHNA REDDY COUNTER TO LINGAMANENI RAMESH ON CHANDRABABU HOUSE AK
చంద్రబాబు, లోకేశ్ ఇంటి అద్దె ఇచ్చారా ? లింగమనేనికి వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.
చంద్రబాబు, లింగమనేని రమేశ్ కలిసి నాటకాలు, కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ల్యాండ్ పూలింగ్ ఆగిన చోట లింగమనేని రమేశ్ ఆస్తులు, భూములు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.
తన ఇంటిని కూల్చవద్దంటూ లింగమనేని గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేశ్ సీఎం జగన్‌కు లేఖ రాయడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని దేవినేని ఉమ అనలేదా ? అని ప్రవ్నించారు. అప్పట్లోనే తాడేపల్లి తహసీల్దార్ ఈ అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యానించారు. ఆ ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చానని గతంలో చెప్పిన లింగమనేని రమేశ్... ఇప్పుడు నా ఇంటిని కూల్చుతున్నారంటూ లేఖలు రాయడం ఏంటని ఎమ్మెల్యే ఆళ్ల మండిపడ్డారు. చంద్రబాబు ఆడించినట్టు లింగమనేని రమేశ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు, లింగమనేని రమేశ్ కలిసి నాటకాలు, కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ల్యాండ్ పూలింగ్ ఆగిన చోట లింగమనేని రమేశ్ ఆస్తులు, భూములు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. లింగమనేని రమేశ్‌పై కక్ష కట్టే ఆలోచన ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని అన్నారు. యజ్ఞాలు, యాగాలు చేసేందుకు ఇల్లు కట్టామని లింగమనేని రమేశ్ చెబుతున్నారని... ఐదేళ్లలో ఎన్ని యాగాలు అక్కడ చేశారని ప్రశ్నించారు. ఐదేళ్లలో కోటి ఇరవై లక్షల హెచ్ఆర్ఏ తీసుకున్న చంద్రబాబు, లోకేశ్... వాటిని లింగమనేని రమేశ్‌కు చెల్లించారా ? ఒకవేళ చెల్లిస్తే దాన్ని లింగమనేని రమేశ్ తన ఐటీ రిటర్న్స్‌లో చూపించారా ? అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రవ్నించారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ ముమ్మాటికి అక్రమ నిర్మాణమే అని ఎమ్మెల్యే ఆళ్ల ఆరోపించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.