ఏపీకి ప్రత్యేక హోదా.. కేంద్రానికి వైసీపీ డిమాండ్..

వైఎస్ జగన్ (ఫైల్)

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెబుతూ వస్తున్న సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

  • Share this:
    ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెబుతూ వస్తున్న సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అలాగే..పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని చెబుతూనే.. ఏపీ అభివృద్ధికి సంబంధించి 9 అంశాలను లేవనెత్తింది. రెవెన్యూ లోటు బకాయిలు రూ.18,969 కోట్లు విడుదల చేయాలని, వెనుకబడిన జిల్లాలకు రూ.23వేల కోట్లు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,283 కోట్లను కేంద్ర రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరింది. అలాగే.. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ గ్రాంట్‌గా రూ.47,424 కోట్లు ఇవ్వాలని రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక సాయం చేయాలని అడిగింది.

    కాగా, పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరుగుతోన్న ఈ భేటీకి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి.. టీఆర్‌ఎస్ నుంచి కేకే, నామా.. టీడీపీ తరఫున గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు పై డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: