YCP LEADERS ATTACKED JANA SENA FOLLOWERS IN VISAKHAPATNAM NGS
Visakhapatnam: విశాఖలో వైసీపీ వర్సెస్ జనసేన? మేయర్ ప్రమాణ స్వీకారమైనా ఆగని విబేధాలు
విశాఖలో జనసేన కార్యకర్తలపై దాడి
విశాఖలో కార్పొరేషన్ ఎన్నికలు ముగిసాయి. మేయర్ ప్రమాణ స్వీకారం కూడా అయ్యింది. అయినా రాజకీయ పార్టీల మధ్య వార్ ఆగడం లేదు. తమ పార్టీ కార్యకర్తలపై దాడిని సీరియస్ గా తీసుకున్న జనసేన నేతలు.. న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు.
ఏపీలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేపయి గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేప కూటమి మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా కనిపించాయి. అధికార వైసీపీ ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని సొంతం చేసకుంది. టీడీపీ 30 సీట్లతో సరిపెట్టుకుంది. కానీ జనసేన, బీజేపీ కూటమి సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.
ఫలితాలు ఎలా ఉన్నా.. ఎన్నికల ప్రచార సమయంలో, కౌటింగ్ రోజు చాలా చోట్ల వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఎన్నికల్లో ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ విశాఖలో మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మేయర్, డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయాయి. అయినా ఘర్షణలు ఆగడం లేదు.
తాజాగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. మార్చి 13న తలెత్తిన వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు తమ కార్యకర్తల అర్జిల్లి అప్పలరాజు, అతడి కుటుంబ సభ్యుల పై దాడిచేసి తీవ్రంగా గాయపరచడం దారుణమని మండిపడుతున్నారు జనసేన నేతలు.
తీవ్రంగా గాయాలపాలైన అర్జీల్లి అప్పలరాజు, బొంది ముత్యాలు, బొంది బంగారమ్మ, కుటుంబ సభ్యులు ఆ గొడవపై పరవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసులును పట్టించుకోవడం లేదని జనసేన నేతలు మండిపడుతున్నారు. పోలీసులు, అధికార పార్టీ నేతల తీరుపై జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించే అంత వరకు జనసేన కృషి చేస్తుందని బాధిత కుటుంబానికి భోరసా ఇఛ్చారు పార్టీ నేతలు. గాయపడ్డ వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అన్ని విధాల అండగా ఉంటామన్నారు. విశాఖలో కార్పొరేషన్ ఎన్నికలు ముగిసాయి. మేయర్ ప్రమాణ స్వీకారం కూడా అయ్యింది. అయినా రాజకీయ పార్టీల మధ్య వార్ ఆగడం లేదని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చే్స్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడిని సీరియస్ గా తీసుకున్న జనసేన నేతలు.. న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.