Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి... శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం

    2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు వైవీ సుబ్బారెడ్డి.

    news18-telugu
    Updated: June 22, 2019, 12:21 PM IST
    టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి... శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం
    తిరుమలలో ఇప్పటి వరకూ 140 కేసులు నమోదు అయ్యాయని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
    • Share this:
    తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపధ్యంలో వైవీ ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. కాలినడకన ఆయన తిరుమల చేరుకున్నారు. గురుడళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

    2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు వైవీ సుబ్బారెడ్డి. ఈసారి రాజకీయ సమీకరణాల రీత్యా ఆస్ధానాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డికి కేటాయించడంతో పార్టీలో ఆయన స్ధానంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సీఎం జగన్... సుబ్బారెడ్డికు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పిస్తే బాగుంటుందని పార్టీలో అభిప్రాయం వ్యక్తమయింది. దీనిపై తనకు టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి చేపట్టడం ఇష్టమనే సంకేతాలిచ్చారు వైవీ. అదే సమయంలో సీఎం జగన్ తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. దీంతో ఎట్టకేలకు అంతా భావించినట్లే జగన్ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి అప్పగించారు.
    Published by: Sulthana Begum Shaik
    First published: June 22, 2019, 12:09 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading